ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ఎస్‌ఎస్ రాజమౌళి కాంపౌండ్ నుంచి ఎస్‌ఎస్‌ఎంబీ 29 రాబోతున్న విషయం తెలిసిందే. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ఇదివరకెన్నడూ రాని విధంగా గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా రాబోతున్నట్టు ఇప్పటికే అప్‌డేట్స్ కూడా తెరపైకి వచ్చాయి. మహేశ్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉండగా.. జక్కన్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 పనులపై ఫోకస్ పెట్టాడు. తాజాగా మహేశ్ బాబు అభిమానులను ఖుషీ చేసే వార్త ఒకటి బయటకు వచ్చింది. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జులై చివరకల్లా పూర్తవనుంది. నా కథ జులై కల్లా పూర్తవుతుంది ఎమోషన్స్‌తో కూడిన అడ్వెంచరస్, యాక్షన్ డ్రామా నేపథ్యంలో లైన్‌లో ఉండబోతుంది. సీక్వెల్ తెరతీసేలా క్లైమాక్స్‌ను ఉండబోతుంది..అని రైటర్ విజయేంద్రప్రసాద్ చెప్పిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ లెక్కన ముందుగా వచ్చిన వార్తల ప్రకారం వీలైనంత త్వరలోనే ఎస్‌ఎస్‌ఎంబీ 29 ప్రాజెక్ట్ లాంఛ్ కావడం పక్కా అని తెలిసిపోతుంది.
ఎస్‌ఎస్‌ఎంబీ 29లో మహేశ్ బాబు పాత్ర లార్డ్‌హనుమాన్ స్ఫూర్తిగా జంగిల్ అడ్వెంచర్ నేపథ్యంలో సాగనుందని ఇప్పటికే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఎస్‌ఎస్‌ఎంబీ 29 ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా రానుందని ఇన్‌సైడ్ టాక్. ఎస్‌ఎస్‌ఎంబీ 29లో ఎక్కువ భాగం అమెజాన్ ఫారెస్ట్‌లో చిత్రీకరించబడుతుందని సమాచారం. ఇటీవలే లాంఛ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ అభిమానులకు కావాల్సిన ఫుల్ మీల్స్ అందివ్వబోతున్నట్టు చెబుతోంది. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తవగానే జక్కన్న ప్రాజెక్టుతో బిజీగా కానున్నాడు మహేశ్ బాబు.