Thursday, September 12, 2024
spot_img

టెస్టు క్రికెట్‌లో రికార్డు..

తప్పక చదవండి

ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ టామీ బీమాంట్‌ సరికొత్త రికార్డు నెలకొల్పింది. టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్‌ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా ఆ జట్టు ఓపెనింగ్‌ బ్యాటర్‌ టామీ బీమాంట్‌ నిలిచింది. మహిళా యాషెష్‌ – 2023 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో బీమాంట్‌ ఈ ఫీట్‌ సాధించింది. 32 ఏళ్ల బీమాంట్‌ 331 బంతులను ఎదుర్కొని 208 పరుగుల స్కోర్‌ చేసింది. దాంతో ఇంగ్లండ్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన మహిళా బ్యాటర్‌గానే కాకుండా, తొలి డబుల్‌ సెంచరీ చేసిన మహిళా బ్యాటర్‌గా కూడా బీమాంట్‌ ఘనత వహించింది. 1935లో ఇంగ్లండ్‌ తరఫున న్యూజీలాండ్‌పై మహిళా బ్యాటర్‌ బెట్టీ స్నో బాల్‌ చేసిన 189 పరుగులే ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు