మహాభారత్ టీవీ సీరియల్‌లో శకుని పాత్రను పోషించిన ప్రఖ్యాత నటుడు గుఫి పెయింటాల్ ఇక లేరు. సోమవారం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 79 ఏళ్లు, గుఫి మృతిచెందిన సమాచారాన్ని ఆయన బంధువు హితేన్ పెయింటాల్ వెల్లడించారు. సబర్బన్ అంధేరిలోని ఓ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగించారు. ఇవాళ ఉదయం 9 గంటలకు ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు హితేన్ తెలిపారు. 1980 దశకంలో గుఫి అనేక హిందీ చిత్రాల్లో నటించారు. సుహాగ్, దిల్‌లగీ లాంటి ఫిల్మ్స్‌లో చేశారు. సీఐడీ, హల్లో ఇన్‌స్పెక్టర్ లాంటి టీవీ షోల్లోనూ నటించారు. బీఆర్ చోప్రా తీసిన మహాభారత్ సీరియల్‌లో ఫేమస్ శకుని మామ పాత్రను ఆయన పోషించారు. గుఫికి కుమారుడు, కోడలు, మనువలు ఉన్నారు. అంధేరిలోని శ్మశానవాటికలో ఇవాళ సాయంత్రం ఆయన పార్దీవదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.