Thursday, September 12, 2024
spot_img

స్టన్నింగ్ విజయ్‌ క్రేజ్‌..

తప్పక చదవండి

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ లియో . స్టార్ డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. త్రిష ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్‌ ప్రోమో గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. తాజాగా లియోకు సంబంధించిన ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. లియో ఓవర్సీస్‌ రైట్స్‌ కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజా టాక్‌ ప్రకారం లియో ఓవర్సీస్ హక్కులు రూ.60 కోట్లు అమ్ముడుపోగా.. లీడింగ్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్‌ హౌజ్‌ ఫార్స్ ఫిలిం ఈ రైట్స్‌ను దక్కించుకున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. ఈ ఫిగర్‌ తమిళ సినీ చరిత్రలోనే ఆల్‌టైమ్‌ హయ్యెస్‌ ఓవర్సీస్‌ డీల్ కావడం విశేషం. అంతేకాదు సలార్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత అత్యధిక ఓవర్సీస్‌ డీల్ దక్కించుకున్న మూడో సినిమాగా నిలిచినట్టు ట్రేడ్‌ సర్కిల్ సమాచారం. ఓవర్సీస్‌లో ఇదివరకెన్నడూ విడుదల చేయని విధంగా లియోను లాంఛ్ చేయబోతున్నట్టు ఫార్స్‌ ఫిలిం ప్రతినిధి చెప్పారు. మరిన్ని వివరాలపై రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది. లియోలో మలయాళ భామ శాంతి మాయాదేవితోపాటు బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్‌, యాక్షన్‌ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్‌, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్ వాసు దేవ్‌మీనన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లియో అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి టాలెంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లోకేశ్‌ కనగరాజ్‌, రత్నకుమార్‌, ధీరజ్‌ వైడీ డైలాగ్స్ రాస్తున్నారు. మాస్టర్ తర్వాత విజయ్‌, లోకేశ్ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా అవడంతో లియోపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు