Sunday, May 5, 2024

ఆర్మ్ డ్ ఫోర్స్ లో ఉద్యోగాలు..

తప్పక చదవండి
  • అర్హత డిగ్రీ పాస్..
  • మొత్తం పోస్టులు 1876..

డిగ్రీ అర్హ‌త‌తో.. కేంద్ర బలగాల్లో 1876 ఎస్‌ఐ పోస్టులు బి సెంట్రల్‌ సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌, ఢిల్లీ పోలీస్‌ శాఖలో ఎస్‌ఐ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మంచి జీత భత్యాలు, భద్రమైన కొలువు, దేశసేవ చేసుకునే అవకాశంతోపాటు చక్కటి పదోన్నతులతో కూడిన ఈ పోస్టుల భర్తీ గురించి తెల్సుకుందాం..
మొత్తం ఖాళీలు : 1876.. పోస్టులు : సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్‌ఐ).. జీత భత్యాలు : లెవల్‌-6 ప్రకారం 1,12,400/-.. అర్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.. ప్రస్తుతం డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రాయనున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు 2023, ఆగస్టు 15 నాటికి అర్హత సాధించాలి.. .తప్పనిసరిగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.. వయస్సు : 2023, ఆగస్టు 1 నాటికి 20 -25 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1998, ఆగస్టు 2 నుంచి 2003, ఆగస్టు 1 మధ్య జన్మించి ఉండాలి.. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్లకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఢిల్లీ పోలీస్‌ శాఖకు సంబంధించి వయో పరిమితిలో సడలింపు వెబ్‌సైట్‌లో చూడవచ్చు..

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ), పీఈటీ/పీఎస్‌టీ, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా చేస్తారు.. సీబీటీ.. రెండు పేపర్లు ఉంటాయి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఇస్తారు. పేపర్‌-1లో జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 50 ప్రశ్నల చొప్పున ఇస్తారు. మొత్తం 200 ప్రశ్నలు- 200 మార్కులు.. పరీక్ష కాలవ్యవధి 2 గంటలు.. పేపర్‌-2లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, కాంప్రహెన్షన్‌ నుంచి 200 ప్రశ్నలు – 200 మార్కులు. పరీక్ష కాలవ్యవధి – 2 గంటలు.. నోట్‌: రెండు పేపర్లలో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/3వంతు మార్కులను కోత విధిస్తారు.

- Advertisement -

వివిధ శాఖల్లో ఖాళీలు : ఢిల్లీ పోలీస్‌ -162.. బీఎస్‌ఎఫ్‌ – 113.. సీఎస్‌ఐఎఫ్‌ – 630.. సీఆర్‌పీఎఫ్‌ – 818.. ఐటీబీపీ – 63.. ఎస్‌ఎస్‌బీ – 90.. మొత్తం – 1876
పీఈటీ : 100 మీటర్ల దూరాన్ని పురుషులు 16 సెకండ్లలో, మహిళలు 18 సెకండ్లలో పరుగెత్తాలి. 1.6 కి.మీ దూరాన్ని పురుషులు 6.5 నిమిషాలలో, మహిళలు 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాలలో పరుగెత్తాలి. మూడు అవకాశాల్లో పురుషులు 3.65 మీటర్ల లాంగ్‌జంప్‌, మహిళలు అయితే 2.7 మీటర్ల దూరాన్ని లాంగ్‌జంప్‌ చేయాలి. మూడు అవకాశాల్లో పురుషులు 1.2 మీటర్ల హైజంప్‌, మహిళలు అయితే 0.9 మీటర్ల హైజంప్‌ చేయాలి. పురుషులు మూడు అవకాశాల్లో షాట్‌పుట్‌ను 4.5 మీటర్లు వేయాలి (16 ఎల్‌బీ). మహిళలకు షాట్‌పుట్‌ లేదు.

ముఖ్యతేదీలు : దరఖాస్తు : ఆన్‌లైన్‌లో చివరితేదీ: ఆగస్టు 15.. సీబీటీ తేదీలు : అక్టోబర్‌లో ఉంటాయి.. వెబ్‌సైట్‌: https://ssc.nic.in

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు