Saturday, July 27, 2024

ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించిన ఇన్నోవేటివ్ క్లబ్..

తప్పక చదవండి

హైదరాబాద్: ఇన్నోవేటివ్ క్లబ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఈసీఈ సోమవారం రోజు సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌లో మొదటి సంవత్సరం విద్యార్థులు 1200 ప్లస్ విద్యార్థుల కోసం ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది. సెషన్ 1 – డిజైన్ థింకింగ్, ఇన్నోవేషన్ స్పీకర్ సీఏ నవీన్ నందిగామ హౌ సాల్వ్ ఏ ప్రాబ్లమ్ అండ్ క్రియేట్ ఏ సొల్యూషన్ అనే అంశంపై మాట్లాడారు. డిజైన్ థింకింగ్ ప్రాసెస్‌ను వివరించాడు.. క్యాంపస్‌లో తమ సొంత స్టార్టప్‌ను ప్రారంభించేందుకు విద్యార్థులకు అవగాహన కల్పించాడు సెషన్ 2 – నికీలు గుండా (వ్యవస్థాపకుడు, సీఈఓ, డిజిటల్ కనెక్ట్) సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ పూర్వ విద్యార్ధులు అయినందున అతను క్యాంపస్‌లో ఎలా ప్రారంభించగలిగాడో, వివిధ అవకాశాలను ఎలా ఉపయోగించుకున్నాడో తన కథనాన్ని పంచుకున్నాడు.. అతను ప్రభుత్వంలో స్థానం పొందిన అనుభవాలను పంచుకున్నాడు. అతను తన వ్యవస్థాపక జర్నీని పంచుకున్నాడు.. డిజిటల్ టెక్నాలజీస్‌పై వివిధ అంతర్దృష్టులను పంచుకున్నాడు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రపంచం ఎలా మారుతోంది, పరిశ్రమలో అభివృద్ధి చెందుతోంది, వివిధ ఏ1 సాధనాలు, సాంకేతికతను ఉపయోగించడం ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యం, జ్ఞానాన్ని ఎలా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.. ఆన్‌లైన్‌లో అవకాశాలను పొందగలరు. డిజిటల్ జాన్ – డిజిటల్ బడి వ్యవస్థాపకుడు వివిధ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ అవకాశాలపై మాట్లాడారు.. డిజిటల్ నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఎలా తయారు చేసుకోవచ్చు..? ఆన్‌లైన్‌లో నైపుణ్యాలతో ఎలా ఆవిష్కరించాలి, వారి విద్య కోసం సోషల్ మీడియాను ఉపయోగించడం ఎలాగో తన వ్యవస్థాపక కథనాన్ని కూడా పంచుకున్నారు. వంశీధర్ రెడ్డి, శ్రీకాంత్ గిమ్మడి, ఈసీఈ హెడ్ ఆఫ్ త డిపార్ట్మెంట్, డాక్టర్ రాజి రెడ్డి డైరెక్టర్ సి.ఎం.ఆర్. టెక్నికల్ క్యాంపస్ పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు