బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. తెలుగోడి సత్తా ఏంటో ఈ రెండు సినిమాలతో ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ రెండు చిత్రాల ద్వారా అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులను అందుకున్న రాజమౌళికి.. తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. గ్రామీణ స్థాయి నుంచి క్రికెటర్స్ ప్రతిభను ప్రోత్సహించేందుకు రూపొందించిన ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ తమ ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షుడిగా రాజమౌళిని ఎన్నుకుంది. ఈ సంస్థ దేశంలో స్కూల్ పిల్లల్లో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు కృషి చేస్తోంది. త్వరలోనే ఐఎస్‌బీసీ చైర్మన్‌గా రాజమౌళి బాధ్యతలు చేపట్టనున్నారు.