Thursday, October 10, 2024
spot_img

శ్రీకాకుళం జిల్లాలో బస్సు బోల్తా..

తప్పక చదవండి

ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది . బస్సు స్టీరింగ్‌ విరిగిపోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నరసన్నపేట జాతీయ రహదారి కోమర్తి జంక్షన్‌ వద్ద బోల్తా పడింది. ఈ సమయంలో బస్సులో ఉన్న 19 మంద్రి ప్రయాణికులతో పాటు డ్రైవర్‌, కండక్టర్‌ కు గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. జాతీయ రహదారిపై బస్సు బోల్తాతో ఇరువైపుల ట్రాఫిక్‌ స్థంభించిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు