Saturday, April 27, 2024

సోడా హబ్ ను పరిశీలించిన మంత్రి కేటీఆర్..

తప్పక చదవండి
  • పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు..
    హైదరాబాద్, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
    పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం, దండు మల్కాపురంలోని సోడాహాబ్ యూనిట్ ను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. మల్కాపురంలో బొమ్మల తయారీ పార్కు శంకుస్థాపన సందర్భంగా మంత్రి హరిత పారిశ్రామిక పార్కులో పర్యటించారు. పరిశ్రమల అభివుద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. సకల సౌకర్యాలతో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసి సూక్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు తగిన ప్రోత్సహాం కల్పిస్తున్నామని తెలిపారు. మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డతో కలిసి పర్యటించారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపన, అనుమతులు సరళతరంగా మారాయన్నారు. సోడాహబ్ పరిశ్రమలోని యంత్రాలను , వాటి పనితీరును మంత్రి కేటీఆర్ ఆసక్తిగా తెలుసుకుని గోలిసోడా రుచిచూశారు. ఈ సందర్భంగా సోడా తయారీ విధానాన్ని కంపెనీ ప్రతినిధులు మంత్రికి వివరించారు. కార్యక్రమంలో సోడాహాబ్ ఏండీ నంద శ్రీనివాస్, కంపెనీ ప్రతినిధులు వెంకట్రావు, ఖాదర్, సిబ్బంది పాల్గొన్నారు. ఆనంతరం సోడాహబ్ పరిశ్రమ ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు