Sunday, May 19, 2024

ఆమె భర్తే ఆమె రాజకీయ జీవితానికి ముప్పుగా మారారా..?

తప్పక చదవండి
  • ఆలేరు ఎమ్మెల్యే భర్త మహేందర్‌ జోక్యం హద్దులు దాటిందా..?
  • స్వంత పార్టీ నేతలే ఆమెను,ఆయనను వద్దనుకుంటున్నారా.?
  • అభివృద్ధికి ఆమడదూరంలో ఆలేరు నియోజకవర్గం చేరిపోయిందా?
  • అద్దెభవనాల్లోలోనే ప్రభుత్వ కార్యాలయాల కొనసాగింపు ఎంతకాలం.?
  • నియోజకవర్గంలో గొంగిడి సునీత భర్త రియల్‌ దందాలు ఇంకెన్నాళ్లు..?
  • ఎమ్మెల్యే భర్త దూకుడు చూసి మంత్రి పదవి ఇవ్వలేదన్నది నిజమేనా..?
    హైదరాబాద్‌ : అంతటా ఫాగ్‌ నడిస్తే ఆలేరు నియోజకవర్గంలో గొంగిడి సునీత భర్త గొంగిడి మహేందర్‌ రెడ్డి రియల్‌ దందాలే నడుస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా టీఆర్‌ఎస్‌ నుంచి గొంగిడి సునీత గడిచిన ఎన్నికల్లో 94,870 ఓట్లతో రెండవసారి గెలుపొందారు. ఆమె భర్త గొంగిడి మహేందర్‌ రెడ్డి మాత్రం పెత్తనమంతా తనదే అన్నట్లుగా వ్యవహరిస్తుంటారని నియోజకవర్గంలో పెద్ద ప్రచారమే జరుగుతుంది. గొంగిడి సునీత ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి మహేంద్ర రెడ్డి షాడో ఎమ్మెల్యేగా మారటంతో ఆయనపై,ఆమెపై తీవ్రమైన విమర్శలు స్వంతపార్టీ నేతలే చేయడం గమనార్హం. పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం. ఎమ్మెల్యే ను కలవాలని వెళ్లిన నాయకులను ఎందుకు కలుస్తున్నారో వివరాలు ఆరా తీయడం. అధికారులను పిలుచుకుని మంద లించడం.. ఆదేశాలివ్వడం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తరపున కార్యకర్తల సమావేశాలు నిర్వహించడం.. అధికారిక కార్యక్రమాల్లో గొంగిడి మహేందర్‌ రెడ్డి పాల్గొనడం.. పత్రికల్లో పేరు రాయమని విసిగించడం ఒక్కటేమిటీ ఈయనగారిఫై ఉన్న అభియోగాలు చాంతాడే ఉన్నాయి. రియల్‌ సెటిల్‌ మెంట్లలో ఈయనది అందవేసిన చెయ్యిగా నియోజకవర్గంలో చెప్పుకుంటు న్నారు. రియల్‌ వ్యాపారం బాగా కలిసి రావడంతో అయన ఆర్థికంగా బలపడ్డారని నియోజక వర్గంలో టాక్‌ నడుస్తుంది.
    ఆమె భర్తే ఆమె రాజకీయ జీవితానికి ముప్పుగా మారారా.. ?
    నిజానికి గొంగిడి సునీత రాజకీయ జీవితంలో అదృష్టం.. దురదృష్టం రెండు ఆమె భర్తే నని ఆమె సన్నిహితులు చెప్పుకుంటుంటారు. అంచెలంచెలుగా ఎదిగి ఎంపీపీ అయిన సునీత తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడంతో కేసీఆర్‌ 2014 లో ఆమెకు ఆలేరు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారు. కేసీఆర్‌ ప్రభంజనంలో సునాయాసంగా గెలుపొందిన ఆమె ఎమ్మెల్యే అయ్యారు. ఇక అక్కడి నుంచి ఆమె భర్త మహేందర్‌ రెడ్డి దూకుడు పెంచేశారు .ఆలేరు నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారుల పై పెత్తనం చేస్తూ షాడో ఎమ్మెల్యే గా చరిత్ర పుటల్లో తన పేరును తానే చెక్కుకున్నారు. అధికారులను, నాయకులను తన కనుసన్నల్లోనే ఉండేటట్లు చేసుకున్నారు. ఒకపక్క భర్త పెత్తనం, మరోపక్క నియోజకవర్గంలో తారాస్థాయికి చేరుకున్న వర్గపోరు, ఆశావహుల సూటిపోటిమాటలు, నియోజకవర్గంలో పెరిగిన అసంతృప్తి గొంగిడి సునీత రాజకీయ జీవితంపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి.
    ఆలేరులో వ్యాపారం చేసుకోవాలంటే దక్షిణ చెల్లించుకోవాల్సిందే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యాదాద్రి టెంపుల్‌ విస్తరణ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపించింది. ఫలితంగా యాదాద్రి చుట్టు పక్కల ఉన్న భూముల ధరలకు రెక్కలొచ్చాయి. లక్షల రూపాయల వున్న భూములు కాస్తా ఇప్పుడు కోట్ల రూపాయల ధరలు పలుకుతున్నాయి.ఇక్కడ రియల్‌ వ్యాపారాలు మూడు పూవ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నాయి. దీంతో గొంగిడి మహేందర్‌ రెడ్డి కన్ను రియల్‌ వ్యాపారంపై పడిరది. ఇదే అదనుగా వ్యాపారం చెయ్యాలంటే ఎమ్మెల్యే భర్త గొంగిడి మహేందర్‌ రెడ్డిని ముందుగా కలవాల్సిందే, ఆయన అనుమతి, వ్యాపారంలో వాటా లేకుండా ఇక్కడ రియల్‌ వ్యాపారం జరిగే పరిస్థితి లేదని నియోజకవర్గంలో టాక్‌ నడు స్తుంది. సెటిల్‌మెంట్‌లు కూడా బాగానే చేస్తారనే గుసుగుసలు వినిపిస్తు న్నాయి. షాడో ఎమ్మెల్యే మహేందర్‌ రెడ్డి సెటిల్‌ మెంట్ల గురించి బాధితులు ఆయన పై అనేకసార్లు ఆలేరు నియోజకవర్గం లోనే లోకల్‌ పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు కూడ చేసినట్లు సమాచారం. పోలీసులు మాత్రం ఆ ఫిర్యాదుల గురించి పెద్దగా పట్టించుకోలేదన్న దాఖలాలు లేవని తెలుస్తుంది.
    సెకండ్‌ టైం గెలుపు మహేందర్‌ రెడ్డి ని ఆకాశానికెత్తింది.. 2018లో ఆలేరు నుంచి రెండవసారి గొంగిడి సునీత ఎమ్మెల్యేగా గెలవడంతో మహేందర్‌ రెడ్డి సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. గతంలో ఓఐసీడీఎస్‌ అధికారిణి బాల్య వివాహం అడ్డుకున్నందుకు షాడో ఎమ్మెల్యే మహేందర్‌ రెడ్డి ఆమెను బెదిరించాడని వార్తలొచ్చాయి. తన విధులకు ఆటంకం కలిగించా డని ఏకంగా ఎమ్మెల్యే భర్తపైనే ఐసిడిఎస్‌ ఆఫీసర్‌ పోలీసుకు ఫిర్యాదు చేశారని తెలిసింది. అంటే ఆయన పెత్తనం ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసు కోవచ్చు. అధికారులను పోలీసులను తన గుప్పిట్లో పెట్టుకుని ఎమ్మెల్యే భర్త చక్రం తిప్పుతున్నారనే విమర్శలు ప్రజలలో బాగానే వినిపిస్తున్నాయి. అయితే గొంగిడి మహేందర్‌ రెడ్డి ప్రవర్తించే తీరు చూసి ఎమ్మెల్యే సునీతనా, మహేందర్‌ రెడ్డి నా అని కొందరు అనుకుంటు న్నారు. ఎమ్మెల్యే షాడో అని మరికొందరంటున్నారు. మహేందర్‌ రెడ్డి ప్రవర్త నతో ఎమ్మెల్యే సునీతకు చెడ్డ పేరు వస్తుందని నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. 2018 ఎన్నికల ప్రచారంలో సునీతను గెలిపిస్తే ఈ సారి పెద్ద పదవి ఇస్తానని గులాబీ బాస్‌ కేసీఆర్‌ ఇక్కడి ప్రజలకూ చెప్పారని. అయినా ఎమ్మెల్యే భర్త దూకుడు చూసి మంత్రి పదవి ఇవ్వకుండా ప్రభుత్వ విప్‌తో సరిపెట్టారని ఆలేరు నియోజక వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
    అద్దెభవనాల్లోలోనే ప్రభుత్వ కార్యాలయాల కొనసాగింపు..
    అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం,ప్రభుత్వం సవతి తల్లిప్రేమ కారణంగా దశా బ్దాలనుంచి ఆలేరు నియోజకవర్గాన్ని అంధకారం వీడటంలేదు. నియోజక వర్గంలోని వివిధ ప్రభుత్వ శాఖల కార్యా లయాలు నేటికీ ఇంకా అద్దె భవనాల్లో కొనసాగుతున్నా యి. ప్రధానంగా జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, సబ్‌ ట్రెజరీ, ఐసీడీఎస్‌, ప్రొహిబిషన్‌ అం డ్‌ ఎక్సై జ్‌ కార్యా లయాలు, అగ్ని మాపక కేంద్రం, కేంద్ర కార్మిక ఆసుపత్రి అద్దె భవనాలలోనే కొనసాగు తున్నాయి. ఐసీడీఎస్‌ కార్యా లయం నాలుగు భవనాల్లోకి మారింది. ప్రస్తుతం మం డల పరిషత్తు పాత భవనం లో ఉం ది. దీని పరిధిలో ఆలేరు, రాజపేట, యాదగిరిగుట్ట, మోటకొం డూరు, తుర్కపల్లి మం డలాలు ఉన్నా యి. ఐసీడీఎస్‌ కార్యా లయ నిర్మా ణం కోసం ఎనిమిది సం వత్సరాల క్రితం మండల పరిషత్తు కార్యా లయం ఆవరణలో 1,000 చదరపు గజాల స్థలాన్ని కేటాయిం చారు. నేటికీ భవన నిర్మా ణం కార్యరూపం దాల్చ లేదు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు