Saturday, July 27, 2024

చల్లని మజ్జిగ పంపిణీ..

తప్పక చదవండి
  • చల్లని మజ్జిగ, సబ్జా లేమాన్, చల్లని త్రాగునీరు పంపిణీ చేసిన సూరన్న, వంశీ సందీప్
  • కనెస్ట్ ఫర్ సొసైల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం..

హైదరాబాద్, కనెస్ట్ ఫర్ సొసైల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు సూరన్న, జాడే వంశీ దుర్గం సందీప్. ఈ సందర్భంగా సూరన్న మాట్లాడుతూ
సేవే మా మార్గం చేయూతే మా లక్ష్యం అన్నారు.. ప్రతి సోమవారం కౌతాల మండల కేంద్రంలో సంతకు వచ్చే జనాలు 5000లకు పైగా ఉంటారు. ఎండలు మండుతున్న కారణంగా ఈ సేవ కార్యక్రమం చెయ్యడానికి మేం ముందుకు కదిలినాము. ఇది మేం చేసిన రెండవ కార్యక్రమం. ఈ మజ్జిగ పంపిణీ కొరకు మాకు తెలిసిన మిత్రులనుండి కొంతమేరకు ఆర్థిక సహాయం అందింది. అంతేకాకుండా జాడే వంశీ, దుర్గం సందీప్ మిత్రులు దగ్గరుండి ఈ మజ్జిగకు కావాల్సిన సామగ్రి మొదలుకొని అనేక పనుల్లో తోడుగా ఉంటున్నారు. సంపాదించేవారు చాలామంది ఉన్నారు కానీ మంచి పని చెయ్యడానికి మానవత్వం కలిగినవారు బహు తక్కువమంది ఉన్నారు. మంచి పని చేయడం ఒక బాధ్యతలా భావించి ఈ కార్యక్రమం చెయ్యడానికి పూనుకున్నాము. ప్రజలు తీవ్ర ఎండలో ఇబ్బందిపడకుండా ఉండాలని గమనించి ఉచితంగా మజ్జిగ మరియు సబ్జా లేమన్ వాటర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఎండ తీవ్రతను బట్టి కొందరు వడదెబ్బ బట్టి కొందరు ఇలా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా అనేక సంఘటనలు చూసి చలించి పోయి ప్రజలకు సేవ చెయ్యాలని ప్రజల దప్పిక తీర్చాలని ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు.. మాతో కలిసి భాగస్వామ్యం కావాలని అనుకునేవారు లేదా మేం చేస్తున్న కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించేవారు ఎవరైనా ఉంటే వెంటనే మమ్మల్ని ఈ నెంబర్ లో సంప్రదించండి.. ( 8790031672 ). స్పందించండి – సహకరించండి – సహాయపడండి అని కోరారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు