- వందలలో విద్యార్థులకు కండ్లకలక..
- ఆ హాస్టల్లో కెపాసిటికి మించిన విద్యార్థులు..
- విద్యార్థులకు మోక్షమే లేదా..?
- వరుస వార్తల్లో నిలుస్తున్న ప్రిన్సిపాల్ జయమ్మ..
- అవస్థల వలలో మొయినాబాద్ బాలికల గురుకుల హాస్టల్..
- పట్టించుకోని అధికారులు, నాయకులు..
ఆ హాస్టల్లో అంతా మాయే.. ఉన్నది ఒకటి చూపిస్తున్నది మరోకటి, విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా.. అనారోగ్యంతో అవస్థల పాలవుతున్నా ప్రిన్సిపాల్‌కి పట్టింపులేదు.. సమస్యలు పరిష్కారం కావు.. విద్యార్థులకు మోక్షం దొరకదు. వారి పదవులకు మచ్చరాకుండా, హాస్టల్‌కు పేరు రాకుండా వారి పూర్తి బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.. శంకర్‌పల్లి ప్రాంతానికి చెందిన మొయినాబాద్ బాలికల గురుకుల హాస్టల్లో ఇదీ పరిస్థితి..
వందల మంది విద్యార్థులకు కళ్ల కలకలు :
మూలుగుతున్న నక్కమీద తాటికాయ పడ్డట్టు, మొన్న షార్ట్ సర్య్కూట్ వచ్చి అర్థరాత్రి రోడ్లపై పరుగులు తీసి ఓ గుడిలో తలదాచుకుర్రు, దాని వెంటనే కొంత మందికి కళ్ళకలకలు వస్తే భాస్కర్ మెడికల్ కాలేజీ వైద్యులు వైద్య శిబిరం నిర్వహించి పరీక్షలు చేస్తే దాదాపుగా వందల మంది విద్యార్థినిలకు కళ్లకలక వచ్చాయని వైద్యులు నిర్ధారించారు. వరుసగా రోజు రోజుకు ఆ వ్యాది సోకిన సంఖ్య పెరుగుతుంటారని వైద్యులు చెబుతున్నారు. పద్దతి ప్రకారం ఐసోలేట్ చేస్తేనే తప్ప ఈ వ్యాదిని అరికట్టలేమని వైద్యులు అంటున్నారు.
సామర్థ్యం వందకే :
ఆ హాస్టల్ సామర్థ్యం 100 మంది విద్యార్థులకే.. కానీ అక్కడ ఉంటున్నది 600 మంది విద్యార్థినిలు.. అసలే వారు స్త్రీలు.. వారి పర్సనల్ సమస్యలు చాలా ఉంటాయి.. దానికి తోడు నీటి సమస్య.. చుట్టూ చెత్త చెదారంతో మురుగు కంపు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా అంతా సమస్యల గుండమే.. ఈ గురుకుల పాఠశాలలో.
మా పిల్లలకు మోక్షం లేదా..?
మా పిల్లలకు మోక్షమే లేదా దేవాడా..? మొన్న కరెంట్ షార్ట్ వచ్చి అర్థరాత్రి రోడ్లమీదికి ఉరికర్రంటా.. ఇప్పుడు కళ్లోచ్చినాయంటా.. చూసుకుందామంటే ఇంటికి పంపరాయే ఏం పరిచ్చా పెడితివిరా దేవుడా.. అంటూ ఓ తల్లి ఆవేధన వ్యక్తం చేస్తోంది..
మా పేదరికేమే మేలు :
పేదరికంతో ఉన్న మేమే చాలా బాగా చూసుకునే వారిమెమో.. ఇంట్లో ఏదో పేదరికిం వల్ల ప్రభుత్వ హాస్టల్లో చేర్పిస్తే.. అక్కడ కూడా ఇంత దారుణమా. గుడిసెలలో ఉన్న అంతకంటే సుఖంగా చూసుకునే వారిమి అంటూ ఓ తండ్రి ఆవేధన వ్యక్త పరుస్తున్నారు.
సమస్యలు పరిష్కారం అవుతేనే మళ్ళీ పంపిస్తా : విద్యార్థిని తండ్రి నర్సింలు..
అక్కడి సమస్యలు చెప్పుకోలేనివి. హాస్టల్లో సమస్యలకు పరిష్కారం చేస్తేనే మళ్ళీ మా పాపను హాస్టల్‌కి పంపిస్తాను.. లేదంటే ఇక్కడే ఏదన్న స్కూల్‌కి పంపించి చదివించికుంటా.. మా పాపకు కంటి కలక వచ్చిందని హాస్టల్ నుంచి తీసుకుని వచ్చా.. పాప నుంచి మా ఇంట్లో అందరికి కంటికలక సోకిందని ఆ బాలిక తండ్రి నర్సింలు అంటున్నారు.
వరుస వార్తల్లో ప్రిన్సిపాల్ జయమ్మ :
తాను ఓ ప్రభుత్వ ఉద్యోగి అన్న విషయమే మరుస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలో తెలియదు. విద్యార్థులను ఎలా చూసుకోవాలో తెలియదు. వీటన్నింటికి కారణం స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యకి ప్రిన్సిపాల్ జయమ్మకు చుట్టరికం ఉందని పేరెంట్స్ అంటూ ఉంటారు. అందుకనే స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రిన్సిపాల్ ఎన్ని తప్పులు చేసిన చూసి చూడనట్టు ఉంటారని పేరెంట్స్ అంటున్నారు.
అన్ని అబద్దాలే : ప్రిన్సిపాల్ జయమ్మ
అన్ని అబద్దాలే.. బయట చెప్పుకునే వార్తలు తప్పు.. మేము చాలా బాగా చూసుకుంటున్నాము. ఎదో కొంత మందికి కంటి సమస్య వస్తే వారికి ఐసోలేట్ చేశాము.. వారికి తగ్గిపోయింది. ఇంటికి పంపడానికి మా అధికారుల అనుమతి లేనిది పంపించలేమని ఆమె చెప్పుకొచ్చారు..