Saturday, July 27, 2024

ధోనీకి శుభాకాంక్షల వెల్లువ

తప్పక చదవండి

ప్రత్యేక ఫోటోలతో ట్వీట్‌ చేసిన బిసిసిఐ

ముంబై, భారత జట్టు గొప్ప కెప్టెన్లలో ఒకడైన మహేంద్ర సింగ్‌ ధోనీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 42వ పడిలోకి అడుగుపెట్టిన మిస్టర్‌ కూల్‌ మహీకి సహచరులు, మాజీ క్రికెటర్లతో పాటు బర్త్‌ డే విషెస్‌ చెప్పారు. బీసీసీఐకూడా ఈ లెజెండరీ క్రికెటర్‌కు అభినందనలు తెలుపుతూ స్పెషల్‌ ట్వీట్‌ చేసింది. అందులో ధోనీ వరల్డ్‌ కప్‌ ట్రోఫీ పట్టుకొని కూర్చుకున్నాడు. అతడి వెనక 7వ నంబర్‌ జెర్సీ ఉంది. మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌ భారత్‌కు 2007లో పొట్టి ప్రపంచకప్‌, 2011లో వన్డే ప్రపంచకప్‌, 2013లో చాంపియన్స్‌ ట్రోఫీ 2013 సాధించి పెట్టాడు. అతడి ఘనతలను గుర్తు చేసేలా ఉన్న ఈ పోస్ట్‌ సోషల్‌విూడియాలో వైరల్‌ అవుతోంది. తొలినాళ్లలో పొడవైన జుల పాల జుట్టుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ధోనీ అనతికాలంలోనే కెప్టెన్‌గా ఎదిగాడు. టీమిండియాకు అద్భత విజయాలు అందించిన కెప్టెన్లలో అతను ముందు వరుసలో ఉంటాడు.ధోనీ సారథ్యంలోని యువ భారత జట్టు ఐసీసీ(ఎఅఅ) తొలిసారి నిర్వహించిన టీ20 వరల్డ్‌ కప్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత సొంత గడ్డపై 2011లో వన్డే చాంపియన్‌గా అవతరించింది. వాం ఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఫైనైల్లో ధోనీ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడి జట్టును గెలిపించాడు. తనదైన స్టయిల్లో సిక్స్‌ కొట్టి మ్యాచ్‌ ముగించాడు. దాంతో, భారత అభిమానులంతా సంబురాలు చేసుకున్నారు. ఎప్పటి నుంచో ఊరిస్తున్న చాంపియన్స్‌ ట్రోఫీ కలను కూడా మహీ నిజం చేశాడు. అతడి కెప్టెన్సీలో ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఓడిరచిన భారత్‌ విజేతగా నిలిచింది. ఐపీఎల్లోనూ ధోనీ తన మార్క్‌ చూపించాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఏకంగా 5 ట్రోఫీలు అందించాడు. దాంతో, చెన్నై జట్టు అత్యధిక ఐపీఎల్‌ ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్‌ రికార్డు సమం చేసింది.

- Advertisement -

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు