Sunday, May 19, 2024

గోదావరిఖనిలో మహాజన జన సంపర్క్ అభియాన్ కార్యక్రమం..

తప్పక చదవండి

మహాజన సంపర్క్ అభియాన్ లో భాగంగా గురువారం గోదావరిఖని లోని జీఎం కాలనీ 79వ పోలింగ్ కేంద్రంలో కార్యక్రమం జరిగింది. బీజేపీ, ఎస్సీమోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్ నేతృత్వంలో బూత్ అధ్యక్షుడు ఇటిక్యాల మధు, శక్తి కేంద్రం ఇంచార్జ్ గుండెబోయిన భూమయ్య, సహాయ ఇంచార్జ్ రాదండి శ్రీనాథ్, విశ్వనాథ్, మారం వెంకన్న, హరీష్, అఖిల్, కుమార్, భారత్, పెద్దిరాజు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచి, మోడీ పథకాలను వివరించడం జరిగింది.

నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గా బాధ్యతలు చేపట్టి తొమ్మిది ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రజల కోసం చేపట్టిన ప్రభుత్వ పథకాలను సవివరంగా ఎస్. కుమార్ ఆధ్వర్యంలో నాయకులందరూ ప్రజలకు వివరించారు. ఆ పథకాల పేర్లతో పాటు తెలంగాణ ఇచ్చిన నిధులను చెప్పడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు.. ఇలాంటి కార్యక్రమాన్ని కొనసాగించాలని ఈ దేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదర్శమని ఆయనే మరోసారి ప్రధాని కావాలని ఆకాంక్షను వారు వెలిబుచ్చారు.
రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆదేశాలతో తెలంగాణలోని 35 లక్షల కుటుంబాలను ఒకేరోజు కలిసి వివరించడం గొప్ప విషయం. గోదావరిఖనిలోని జిఎం కాలనీలో జన సంపర్క్ అభియాన్ విజయవంతం అయినది. మొదటి రోజు 79వ బూతులను దాదాపు 100 ఇళ్లలో కార్యక్రమం నిర్వహించడమే కాకుండా మిస్డ్ కాల్ ఇచ్చి ప్రజలు భాగస్వాములు కూడా అయ్యారు. ప్రతి ఇంటికి స్టిక్కర్ ని అంటించడం జరిగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు