Sunday, June 23, 2024

నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా భీమదేవరపల్లి బ్రాంచి..

తప్పక చదవండి

యంగ్ డైరెక్టర్ రమేష్ చెప్పాల దర్శకత్వంలో నిర్మాతలు బత్తిని కీర్తిలతా గౌడ్, రాజా నరేంద్ర చెట్లపెల్లి నిర్మించిన చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి.. పూర్తి గ్రామీణ నేపథ్యంలో, అత్యంత సహజంగా ఉండే పాత్రలతో.. ప్రేక్షకులను ఒకవైపు నవ్విస్తూనే, మరో వైపు భావోద్వేగానికి గురిచేస్తూ.. ఆలోచింపజేసే కథా కథనాలతో సాగే హార్ట్ టచింగ్ మూవీ అని దర్శకులు తెలియజేశారు.. ఈ మధ్య విడుదలైన ట్రైలర్ కి మంచి స్పందన లభించింది.. ఉచిత పథకాల వల్ల ఎలాంటి ఆనాధలు జరుగుతున్నాయో కళ్ళకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపించినట్లు దర్శకులు తెలిపారు.. ఇక ఈ చిత్రంలో మాజీ సర్పంచిగా నటించిన వివ రెడ్డి మాట్లాడుతూ.. తనకు ఒక మంచి పాత్రను ఇచ్చిన దర్శకులు, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేసారు.. ఉచిత పథకాలవల్ల మనుషులని బానిసలను చేస్తుండ్రు … ఈ ఓటు బ్యాంకు రాజకీయాలకు అగ్గిపెట్టాలే ” అంటూ ఆయన పలికిన డైలాగుకు అద్భుతమైన స్పందన లభించింది.. ఇక ఈ చిత్రానికి చరణ్ అర్జున్ అద్భుతంమైన సంగీతాన్ని అందించారు.. ఇదొక ఆర్గానిక్ సినిమా.. ఈ సినిమా నేడు ( జూన్ 23 న ) విడుదలవుతుంది.. అందరూ తప్పక చూసి ఆదరించండి, ఆశీర్వదించండి… అంటూ వివ రెడ్డి ( విష్ణువర్ధన్ రెడ్డి మావూరిపు ) తెలిపారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు