Monday, February 26, 2024

మాకొద్దీ తెల్లదొరతనమని ప్రజలను చైతన్య పరిచిన గరిమెళ్ళ

తప్పక చదవండి

స్వాతంత్య్రోద్యమ కాలంలో ‘‘మాకొద్దీ తెల్ల దొరతనం’’ అంటూ తన పాటలతో ప్రజలను ఉర్రుతలూగించి స్వాతంత్య్ర పోరాటం వైపు జనాలను మళ్లించిన జాతీయ కవి శ్రీ గరిమెళ్ళ సత్య నారా యణ. బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా గేయాలు రాసి సమ రభేరి మోగించారు. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా, నిర్మోహ మాటంగా గేయాల రూపంలో రాసి బ్రిటీష్‌ వారి గుండెల్లో నిలువగా, ఉద్యమ కారుల్లో స్ఫూర్తి రగిలించాయిగరిమెళ్ల సత్యనారాయణ 1893 జూలై 14వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా గోనెపాడు గ్రామంలో ఒకపేద బ్రాహ్మణకుటుంబంలో జన్మించారు. విజయ నగరం, రాజమహేంద్రవరం, మచిలీపట్నం మూడు ప్రాంతాలలో తన విద్యను పూర్తి చేశాడు. తరు వాత, గంజాం అతని వృత్తిపం మైన నివాసంగా మారింది, అక్కడ కలెక్టర్‌ కార్యాలయంలో ఉపా ధ్యాయుడిగా మరియు గుమ స్తాగా పనిచేశాడు. దేశభక్తి కవితలు వ్రాసి పాడి జైలు శిక్ష అను భవిం చినవారిలో ప్రథముడు గరి మెళ్ళ. ఈయన పాటలు సత్యాగ్రహు లకు గొప్ప ఉత్తేజాన్ని కలుగ జేసేవి. అలాగే ‘‘దండాలు దండాలు భరతమాత ‘‘అనే గీతము ప్రజలను ఎంతాగానో జాగృతము చేసింది. 1920లో ఉపాధ్యాయ శిక్షణ ముగించుకుని గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణోద్యమం లో చురుగ్గా పాల్గొన్నారు. ఒకానొక సందర్భంగా విజయనగరంలో ఏర్పాటు చేసిన సభలో బిపిన్‌ చంద్రపాల్‌ ఉపన్యాసాలకు ఆకర్షితు లై తానుచేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి జాతీయోద్యమంలో చురు గ్గా పాల్గొన్నారు. ‘మాకొద్దీ తెల్లదొరతనము.’ అంటూ గొంతెత్తి పాడుతూ రాజమండ్రి వీధి వీధినా తిరిగారు. ఎక్కడికక్కడ జనం ఆయన చుట్టూ చేరి ఆయన తో పాటే గొంతు కలిపారు. ఆనాటి రోజుల్లో ఆ పాట నకలు ప్రతులు ఒక్కొక్కటీ పన్నెండు పైసలకు అమ్ముడు పోయాయంటే, గరిమెళ్ల పాట ఏ స్థాయిలో జనాలను ప్రభావితు లను చేసిందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్‌ కలెక్టర్‌కు తెలుగుభాష రాకపోయినా, గరిమెళ్ల చేత ఈ పాట పాడిరచుకుని విన్నాడు. తనకు భాష అర్థం కాకపోయినా, ఈ పాట జనాలను ఏ స్థాయిలో ఉద్రేకపరచగలదో ఊహించగలనంటూ గరిమెళ్లకు ఏడా ది కఠిన కారాగార శిక్ష విధించాడు. జైలు నుంచి విడుదలై బయ టకు వచ్చాక ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. చాలా చోట్ల ఆయనకు ఘన సన్మానాలు చేశారు. అయితే, కొద్ది రోజులకే ఆయన భార్యమరణించింది.అప్పటికే ఆయనకుఇద్దరు కుమార్తెలు. వాళ్ల ఆలనాపాలన కోసం మళ్లీ పెళ్లి చేసుకున్నారు. సరైన ఉద్యో గం ఎక్కడా లేకపోవడంతో అప్పులపాలయ్యారు. అప్పులు తీర్చడా నికి ఆస్తులను అమ్ముకున్నారు. కొం త కాలం ప్రియాగ్రహారంలో గ్రం థా లయ కార్యదర్శిగా పని చేశారు. శ్రీ శారదా గ్రంథమాలను స్థాపించి, పద్దె నిమిది పుస్తకాలను అచ్చు వేయిం చారు. ఉద్యమకాలంలో ఆయన తరచు విజయ నగరం, రాజమండ్రి, మద్రాసులకు తిరుగుతూ ఉండటం తో అచ్చు వేయించిన పుస్త కాలను అమ్ముకోవడంపై శ్రద్ధపెట్టలేదు. చాలా పుస్తకాలుఇంట్లోనేగుట్టలుగుట్టలుగామిగిలి పోయాయి. వాటికి చెదలుపట్టి నాశనం కావడంతో ఆర్థికంగా నష్టపోయారు. గరిమెళ్ల తొలిపుస్తకం ‘స్వరాజ్యగీతాలు’ 1921లో అచ్చయింది. తర్వాత 1923లో ‘హరిజనగీతాలు’, 1926లో ఖండకావ్యములు, భక్తిగీతా లు, బాలగీతాలు వంటి రచ నలు వెలుగులోకి వచ్చాయి. దుర్భర దారి ద్య్రమును అనా రోగ్యా న్ని అనుభవిస్తూ 59 ఏళ్ల వయస్సులో 1952 డిశంబర్‌ 18న మరణించారు. చివరికి అయన అంత్యక్రియలు ఇరుగు పొరుగు వారు పూనుకొని పూర్తిచేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు