Monday, October 14, 2024
spot_img

స్వియాటెక్‌ జోరు.. ఫ్రెంచ్‌ ఓపెన్‌-2023

తప్పక చదవండి

డిఫెండింగ్‌ చాంపియన్‌, టాప్‌ సీడ్‌ ఇగా స్వియాటెక్‌ టైటిల్‌ వేటలో జోరు ప్రదర్శిస్తున్నది. రౌండ్‌ రౌండ్‌కు తన ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగుతున్నది. గురువారం జరిగిన రెండో రౌండ్‌ పోరులో స్వియాటెక్‌..అమెరికాకు చెందిన క్లెర్‌ లియును మట్టికరిపించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో స్వియాటెక్‌ 6-4, 6-0తో లియుపై అద్భుత విజయం సాధించింది. గంటన్నర పాటు సాగిన పోరులో ఈ పోలాండ్‌ భామ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలి సెట్‌లో ప్రత్యర్థి నుంచి ఒకింత ప్రతిఘటన ఎదురైనా మలి సెట్‌లో స్వియాటెక్‌కు తిరుగులేకుండా పోయింది. కచ్చితమైన బ్యాక్‌హ్యాండ్‌, ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో చెలరేగిన ఈ డిఫెండింగ్‌ చాంప్‌ ఒకే ఏస్‌కు పరిమితమైనా..ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్‌ చేసి తనకెదురు లేదని నిరూపించుకుంది. రెండో సెట్‌లో ప్రత్యర్థికి ఒక్క గేమ్‌నుకూడా వదులుకోకుండా అంతా తానై విజయవిహారం చేసింది. వరుసగా ఏడు గేమ్‌లను గెలుచుకుని మ్యాచ్‌కు ముగింపు పలికింది. మరోవైపు మహిళల నాలుగో సీడ్‌ ఎలెనా రిబకినా వరుస సెట్లలో 6-3, 6-3తో 18 ఏళ్ల లిండా నొస్కోవపై గంటా 26 నిమిషాలలో విజయం సాధించింది. ఆరడుగుల రిబకినా తన హైట్‌ను అనుకూలంగా మలచుకుని ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు