Wednesday, April 24, 2024

ఫ్రీజర్లు పనిజేస్తలేవు…

తప్పక చదవండి
  • ఎం.జీ.ఎం.లో ఆరుబయటే శవాలు..
  • దుర్గంధంతో అల్లాడుతున్న బంధువులు..
  • తెలంగాణాలో బ్రతికున్న వారికే దిక్కులేదు..
  • ప్రాణంపోయిన శవాలకూ తప్పని దుస్థితి..
  • ఇంకెన్ని దాష్టీకాలు చూడాలిరా భగవంతుడా..

అసలేం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో..? ఎన్నెన్ని దౌర్భాగ్యాలు కళ్లారా చూడాలో..? ప్రభుత్వ దవాఖానల దుర్భర పరిస్థితులు జీవితంమీదే విరక్తి పుట్టేలా చేస్తున్నాయి.. వైద్య రంగాన్ని భ్రష్టుపట్టించిన ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలను గాలిలో పెట్టిన దీపంలాగా తయారుచేసి తమాషా చూస్తున్నారు.. బ్రతికున్న వారికే దిక్కులేదు అనుకుంటుంటే.. ప్రాణంపోయిన శరీరాలకు సైతం దిక్కు దిశానం లేకుండా పోతోంది.. వరంగల్ ఎం.జీ.ఎం. లో గడచిన కొంతకాలంగా కళ్ళముందు కనిపిస్తున్న అతి దీనాతి దీనమైన పరిస్థితులు దీనికి అద్దం పడుతున్నాయి..

వరంగల్ : వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలోని మార్చురీలో ఫ్రీజర్లు పని చేయడం లేదు. కొంత కాలంగా ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో మృతదేహాలను ఫీజర్‌లో పెట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆరుబయటే మృతదేహాలను ఉంచాల్సిన పరిస్థితి వస్తోంది. ఆసుపత్రిలోని రోగులు, మృతుల బంధువులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మృతదేహాల నుంచి వచ్చే దుర్వాసనతో రోగులు, కుటుంబ సభ్యులు నరకం చూస్తున్నారు.

- Advertisement -

పేరుకే పెద్దాసుపత్రి, అన్ని సౌకర్యాలు, అన్ని వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా..క్షేత్రం స్థాయిలో మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. ఎంజీఏం ఆసుపత్రిలో ఫ్రీజర్లు మూలకు పడేయంపై మృతుల బంధువులు మండిపడుతున్నారు. ఫ్రీజర్లపై వైద్యాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు