Thursday, April 25, 2024

ఐపీఎస్ అధికారితో తగువు పెట్టుకున్న టాలీవుడ్ నటి

తప్పక చదవండి
  • ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారును కాలితో తన్నడం, కారు తో ఢీ కొట్టిన నటి డింపుల్ హయతి
  • జర్నలిస్ట్ కాలనీలో ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్న నటి హయతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే..
  • రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని పార్కింగ్ ప్లేస్ లో ఢీ కొట్టిన డింపుల్ హయతి , డేవిడ్..
  • జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేసిన రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్.. కేసు నమోదు..
  • 353, 341, 279 సెక్షన్ ల కింద కేసు నమోదు..
  • డింపుల్ పై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసు..
  • పలుమార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఐపీఎస్ అధికారి … తీరు మార్చుకోని డింపుల్
  • ఆగడాలు శృతిమించడంతో ఫిర్యాదు

హైదరాబాద్ : నటి డింపుల్ హాయతి పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. పార్కింగ్ చేసి ఉన్న హైదరాబాద్ ట్రాఫిక్ డిసిపి రాహుల్ హెగ్డే కారును కారుతో ఢీకొట్టి ధ్వంసం చేసిన వ్యవహారంపై డీసీపీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె తో పాటు డేవిడ్ అనే వ్యక్తి పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎంక్లేవ్ లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్ లో నటి డింపుల్ హయతి, డేవిడ్ ఉంటున్నారు. ట్రాఫిక్ డీసీపీ కి చెందిన ప్రభుత్వ వాహనాన్ని ఆయనకు డ్రైవర్ గా ఉన్న కానిస్టేబుల్ చేతన్ కుమార్ అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేస్తున్నారు. ఆయన వాహనం పక్కనే నటి డింపుల్ హాయతి డేవిడ్ లు తమ వాహనాన్ని పార్కింగ్ చేస్తున్నారు. ప్రతిరోజు డిసిపి వాహనానికి ఉన్న కవర్ ను తొలగించడం, వాహనానికి అడ్డుగా పెట్టిన కోన్ లను కాలితో తన్నడం వంటి పనులు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 14న డింపుల్ హైతి తన వాహనంతో డిసిపి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో పార్కింగ్ చేసి ఉన్న డిసిపి కారు ముందు భాగం దెబ్బతిన్నది. సిసి టీవీ ఫుటేజ్ ద్వారా కారణాన్ని తెలుసుకున్న డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డింపుల్ హైతి డేవిడ్ లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లను కూడా పోలీసులకు సమర్పించాడు. ఫిర్యాదు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డింపుల్ హైతి డేవిడ్లను పోలీస్ స్టేషన్కు పిలిచి 41 నోటీసులు ఇచ్చి పంపించేశారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు