Wednesday, October 9, 2024
spot_img

ఉచిత పథకాలపై వ్యంగాస్త్రాలు..

తప్పక చదవండి
  • మన భవిష్యత్ కోసం మన నాయకులు ఇవ్వబోయే ఉచిత పధకాలు..
  • నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న ఐటం..
  1. ‘గొంతులోకే గోరుముద్ద పథకం’ తో ప్రతి ఇంటికీ వండిన వంటకాలు… 2. ‘చేతిలో చత్వారం’ పేరుతో అందరికీ స్మార్టు ఫోన్లిచ్చి ఫ్రీ ఇంటర్నెట్టు, ఫ్రీ ఓటీటీ చానెల్సు.. 3. ‘లివరులోకే లిక్కరు’ పథకంతో ఇంటింటికీ సారా పైపులు.. 4. ‘మస్తిష్కానికే మత్తు’ పేరుతో ప్రజలందరికీ మత్తు పదార్ధాల సప్లై.. 5. ‘ఇంటికీ ఒంటికీ’ పథకం పేరుతో ఉచిత ఇల్లు, ఫర్నీచరు, పవరు సప్లై.. 6. ‘బద్దకస్తులకి బట్టలు’ పేరుతో ఆర్నెలలకో రెండు జతల ఉచిత బట్టలు.. 7. ‘నీడ బతుకులకి ఎండతోడు’ పథకంతో ఇంట్లో ఉండి బోరుకొట్టేసిన బతుకులకి ఉచిత విదేశీ పర్యటన.. 8. ‘పాదాల వద్దకే పుణ్యం’ పేరుతో భగవంతుడ్నే గుమ్మం దగ్గరకి తెచ్చే పథకం.. 9. ‘చదువెందుకు చంకనాక’ పథకం పేరుతో చదవకపోయినా 99శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ సర్టిఫికెట్లు.. 10. ‘పిడకలపై పడకలు’ పేరుతో వైభవోపేతంగా ఉచిత అంతిమయాత్రా వేడుకలు.
  2. వృద్ధ యువతకి బద్దకరత్న బిరుదులు ప్రధానం చేయబడును. కాబట్టి మీ ఖరీధైన ఓటుని మా పార్టికే అమ్ముకోవాలని ప్రార్ధన. ఇట్లు మీ నాయకుడు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు