Sunday, September 8, 2024
spot_img

వైద్యుల నిర్లక్ష్యం..

తప్పక చదవండి
  • ఇన్ఫెక్షన్ కు గురైన 20 రోజుల పసికందు ముక్కు..
  • నారాయణగూడా ఫెర్నాండెజ్ ఆసుపత్రిలో దారుణ ఘటన..
  • ఇప్పటికే రూ. 5 లక్షలు చెల్లించిన తల్లి దండ్రులు..
  • ముక్కు సర్జరీకి ఇంకా డబ్బులు చెల్లించాలని డిమాండ్
    చేసిన ఆసుపత్రి యాజమాన్యం..
  • సంబంధిత వైద్యులపై, హాస్పిటల్ యాజమాన్యంపై పోలీసులకు
    ఫిర్యాదు చేసిన బాలుడి పేరెంట్స్..

నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధి లోని ఫెర్నాండిస్ హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది.. వైద్యులు నిర్లక్ష్యం కారణంగా 20 రోజుల తమ బాబు ముక్కు ఇన్ఫెక్షన్ కు గురైందని బాబు తల్లి దండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు.. బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉందని హీట్ ఆక్సిజన్ పెట్టారు వైద్యులు.. దాని ప్రభావంతో ముక్కు పూర్తిగా దెబ్బతిందని ఆరోపించారు తల్లి దండ్రులు.. కాగా ఇప్పటికే 5 లక్షల రూపాయలు కట్టించుకున్న హాస్పిటల్ యాజమాన్యం.. బాబు ముక్కు సర్జరీ చేయడానికి ఇంకా డబ్బులు చెల్లించాలంటున్నారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు.. హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులపై నారాయణగూడ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు