Tuesday, October 15, 2024
spot_img

ఆ తండ్రి ఆనందం వేరు..

తప్పక చదవండి
  • నాన్నకు ట్రాన్స్‌ఫర్.. కుమార్తెకు బాధ్యతలు..
    (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు)

హైదరాబాద్, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
కర్ణాటక, మండ్య సెంట్రల్‌ ఠాణాకు ఎస్సైగా వర్ష నియమితులయ్యారు. స్టేషన్‌కు వచ్చిన ఆమెకు.. అక్కడ అధికారిగా వ్యవహరిస్తున్న ఆమె తండ్రి వెంకటేశ్‌ బాధ్యతలు అప్పగించారు. తండ్రి నుంచి ఆమె రాజదండాన్ని.. పుష్పగుచ్ఛాన్ని స్వీకరించారు. సైన్యంలో 16 ఏళ్లు సేవలు అందించి, 2010లో ఎస్సై పరీక్షలు రాసిన వెంకటేశ్‌ గత 13 ఏళ్లుగా వివిధ ఠాణాల్లో సేవలందించారు. ప్రస్తుతం మండ్య సెంట్రల్‌ ఠాణాలో విధులు నిర్వహించారు. ఆయన కుమార్తె బీవీ వర్ష గత ఏడాది ఎస్సైగా ఎంపికయ్యారు. ఏడాది ప్రొబేషనరీగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. వెంకటేశ్‌కు బదిలీ కాగా.. ఆ విధుల్లో చేరిన వర్ష బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు