Saturday, July 27, 2024

ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సి.హెచ్ రాజమౌళి బదిలీ..

తప్పక చదవండి
  • పీసీఆర్ నిజామాబాద్ నుంచి సీసీఎస్ సిరిసిల్లకు సి.ఐ. గా పదోన్నది కల్పిస్తూ ట్రాన్స్ ఫర్..
  • నిజాయితీకి మారుపేరుగా.. నేరస్తులకు సింహస్వప్నంగా పేరొందిన రాజమౌళి..
  • ద్యూటీనే ప్రాణంగా భావించి ప్రజా రక్షణకోసం పనిచేసిన యోధుడు..
  • నిజామాబాద్ జిల్లా ప్రజల మనస్సు దోచుకున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..

ఆయన పేరు చెబితే నేరస్తులు గజ గాజా వణకిపోతారు.. అన్యాయం జరిగిన ప్రజలు ఆయనున్నారనే ధైర్యంతో గడుపుతారు.. తన సర్వీస్ లో ఎలాంటి మచ్చలేకుండా.. నీతి, నిజాయితీలు తన ఎజెండాగా, ఊపిరిగా తన విధి నిర్వహణలో రేయింబవళ్లు, నిద్రాహారాలు మాని పోలీసు వ్యవస్థకే ఆభరణంగా మారిన పోలీస్ అధికారి సి.హెచ్ రాజమౌళి.. పీసీఆర్ నిజామాబాద్ లో గురుతర బాధ్యతలు నిర్వహిస్తూ.. ప్రజల మనస్సుల్లో సుస్థిర స్తానం సంపాదించుకున్నారు.. తానున్నాననే ధైర్యాన్ని ఇచ్చారు.. పోలీస్ వ్యవస్థకే వన్నె తెచ్చారు.. తాజాగా ఆయన నిజామాబాద్ నుంచి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిరిసిల్లా రూరల్ ఏరియాకు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరిస్తూ బదిలీ అయ్యారు.. నేరస్తుల పాలిట సింహస్వప్నంగా, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా ప్రసిద్ధి గాంచారు.. క్రిమినల్ సమస్యలను సాల్వ్ చేయడంలో రాజమౌళి దిట్ట అని చెప్పవచ్చు.. సిరిసిల్ల లో కూడా తన మార్క్ విధి నిర్వహణతో ప్రజలకు తోడుగా ఉంటానని, నేరస్తులు ఎంతటి వారైనా తుదముట్టిస్తానని, పోలీస్ వ్యవస్థ అంటే ప్రజల్లో గౌరవం పెరిగేలా పని చేస్తానని.. అపోహలను తొలగించి అహర్నిశలు కృషిచేస్తానని ఈ సందర్భంగా రాజమౌళి చెప్పడం గమనార్హం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు