- కోట్‌పల్లి ప్రాజెక్ట్ దారి మూసివేయడంతో రోడ్డున పడ్డ బోటింగ్ సిబ్బంది..
- జీవనోపాధి కోల్పోయిన చిరు వ్యాపారులు..
- ఉన్నత స్థాయి అధికారులు కనికరించాలని వేడుకోలు
- వచ్చిన పర్యాటకులు వెనుదిరిగి వెళ్లాల్సిన దుస్థితి..
వికారాబాద్ జిల్లా : కోట పల్లి ప్రాజెక్టులోకి వెళ్లే దారిని మూసివేసి బోటింగ్ నిలిపివేయడంతో బోటింగ్ సిబ్బంది ఉపాధి కోల్పోయినట్టు తెలు స్తుంది. ఇప్పటికీ ఐదు నెలలు గడుస్తున్న అధికారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో బోటింగ్ సిబ్బందితో పాటు చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకులతో ఎల్లప్పుడూ కళకళలాడే కోట్ పల్లి ప్రాజెక్టు వెలవెల పోవడంతో ప్రాజెక్టు వద్ద చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్న చిరు వ్యాపారుల మీద సైతం ప్రభావం చూపింది. దారి మూసి బోటింగ్ నిలిపివేయడంతో శని ఆదివారాల్లో పర్యాటకులు వచ్చి వెనుదిరిగి వెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా బోటింగ్ సిబ్బంది, చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. గత ఎనిమిది ఏళ్ల నుంచి ప్రాజెక్టులో బోటింగ్ నడిపేందుకు ఇరిగేషన్ వారు ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ కు అనుమతిం చారు. దీని ద్వారా పరిసర గ్రామాల నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగింది. వికారాబాద్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయుటకు మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా 2015లో కోటపల్లి ప్రాజెక్టులో బోటింగ్ ప్రారంభించడం జరిగింది. తద్వారా చిరు వ్యాపారులు, నిరుద్యోగ యువతకు ఎంతో మేలు జరిగింది.అయితే ప్రాజెక్ట్ లో వేరే చోట ప్రమాదాలు జరిగితే బోటింగ్ ను నిలిపి వేసి మా పొట్ట కొడ్డడం తగదన్నారు. బోటింగ్ వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగలేదు.బోటింగ్ నిర్వహించే చోట పర్యాటకుల భద్రతలో భాగంగా గజ ఈతగాళ్లు,సేఫ్టీ బెల్ట్ ఇచ్చి ప్రత్యేక పర్యవేక్షణ లో బోటింగ్ నిర్వహించడం జరుగుతుందని,అయినప్పటికీ అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఎలాంటి సమాచారం లేకుండా ప్రాజెక్ట్ లోకి వెళ్ళే దారి మూసివేయడంతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని వాపోయారు. ప్రాజెక్టు దారి తెరిచి పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి పరిచి ఈ ప్రాంతంలో పేద ప్రజలకు,ముఖ్యంగా యువతకు జీవనోపాధి కల్పించాలని ఉన్నత స్థాయి అధికారులకు వినతిపత్రం అందజేసినప్పటికి ఎలాంటి స్పందన రాకపోవడం బాధాకరమన్నారు.ఇప్పటికైనా నిరుద్యోగ యువతను, చిరు వ్యాపారులను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులు స్పందించి పర్యాటకులను అనుమతించి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి మా జీవనోపాధిని పునరుద్ధరించాలని వేడుకుంటున్నారు.
చెరువులో బోటింగ్‌ను పునరుద్ధరించాలి…
హైదరాబాద్ మహా నగరానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణ ఊటీగా పిలవబడే అనంతగిరి కి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వచ్చిన పర్యాటకులు తప్పనిసరి కోటపల్లి ప్రాజెక్టును సందర్శిస్తారు. దీనిపై పర్యాటకులు పలువురు స్పందిస్తూ.. చెరువు వద్ద సూచిక బోర్డులను ఏర్పాటు చేసి భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. అంతేకానీ ఇలా ప్రాజెక్టు లోకి దారిని మూసివేయడం సరికాదంటున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి కోటపల్లి ప్రాజెక్టు దారులు తెరిచి బోటింగ్ పునరుద్ధరించాలని పర్యటకులు కోరుతున్నారు.
తప్పక చదవండి
-Advertisement-