కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎల్లమ్మబండ రోడ్డులోని ఎల్లమ్మ చెరువులో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. చెరువులో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి కుడి చేతిపై బాబా సాదుల్లా అని తెలుగులో రాసి ఉంది. ఇక ఆ వ్యక్తి బ్లూ కలర్ చెక్స్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయసు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712568195 అనే నెంబర్ ద్వారా కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.