Saturday, July 27, 2024

దాదా బర్త్‌డే స్పెషల్‌..

తప్పక చదవండి

భారత క్రికెట్‌ గతిని మార్చిన దిగ్గజ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ.. 51వ పడిలోకి అడుగుపెట్టాడు. శనివారం దాదా పుట్టినరోజు సందర్భంగా క్రీడాలోకం అతడిని శుభాకాంక్షల వెల్లువలో ముంచెత్తింది. గడ్డు పరిస్థితుల్లో జట్టు పగ్గాలు అందుకున్న గంగూలీ.. ఎన్నో అవరోధాలను దాటుకొని.. టీమిండియాను ప్రపంచ క్రికెట్‌లో బలమైన శక్తిగా రూపొందించాడు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తే.. అద్భుతాలు చేయగలరని నమ్మిన దాదా.. తన కెరీర్‌ ఆసాంతం ఇదే ఫాలో అయ్యాడు. యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, మహమ్మద్‌ కైఫ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ వంటి ఎందరో ఆటగాళ్లను వెన్నుతట్టి ప్రోత్సహించిన దాదా.. భారత సారథిగా ప్రపంచ క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. అనంతరం క్రికెట్‌ పరిపాలకుడి అవతారమెత్తిన గంగూలీ.. అదే దూకుడు కొనసాగించాడు. అప్పటి వరకు పింక్‌ బాల్‌తో డే అండ్‌ నైట్‌ టెస్టులో ఆడేందుకు ససేమీరా అన్న విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని భారత టెస్టు జట్టు.. దాదా బోర్డు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే తమ తొలి పింక్‌ బాల్‌ టెస్టు ఆడిన విషయం తెలిసిందే. నాయకత్వంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న గంగూలీ.. 51వ పుట్టిన రోజు సందర్భంగా కీలక ప్రకటన చేశాడు. ‘సౌరవ్‌ గంగూలీ మాస్టర్‌ క్లాస్‌’ పేరిట యాప్‌ను అందుబాటులోకి తెచ్చి నాయకత్వ లక్షణాలపై ఆన్‌లైన్‌ కోర్సు ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొన్నాడు. తన అసమాన సారథ్య పటిమతో ఆస్ట్రేలియా వంటి కొమ్ములు తిరిగిన జట్టును సైతం ముప్పు తిప్పలు పెట్టిన గంగూలీ.. ఇకపై తన అనుభవాన్ని అందరితో పంచుకోనున్నాడు. ఈ సందర్భంగా దాదా మాట్లాడుతూ.. ‘సుదీర్ఘ కాలం క్రికెట్‌ ఆడిన అనుభవంతో ఈ బర్త్‌డే సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నా. నేను నేర్చుకున్న అంశాలను మీ కోసం తీసుకొస్తున్నా. ఈ కొత్త యాప్‌ ద్వారా మొదటిసారి నాయకత్వంపై ఆన్‌లైన్‌ కోర్సును అందుబాటులోకి తెస్తున్నా’ అని పేర్కొన్నాడు. దాదా తీసుకున్న నిర్ణయాన్ని పలువురు మాజీ క్రికెటర్లు స్వాగతం పలికారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు