Saturday, May 4, 2024

మాట నిలబెట్టుకున్న బీజేపీ నేత గోగుల రాణా ప్రతాప్ రెడ్డి..

తప్పక చదవండి
  • మహ్మదాపురం గ్రామంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ భవనం ప్రారంభం..
  • ఇచ్చిన మాటకు కట్టుబడి తన సొంత ఖర్చులతో భవన నిర్మాణం..
  • స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హామీలు ఇచ్చి పట్టించుకోలేదు..
  • భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతాప్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు..
  • ఎల్లవేళలా ప్రజల కోసం, ప్రజల సౌకర్యార్ధం కట్టుబడి ఉంటానని వెల్లడి..

( కొందరు నేతలు పదవులకోసమే ప్రాకులాడుతారు.. మరికొందరు పదవులు లేకున్నా ప్రజలకోసమే పట్టుబడుతారు.. అలాంటి కోవకే చెబుతారు ప్రజానాయకులు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి.. )

ఇచ్చిన మాటకు కట్టుబడి మహ్మదాపురం గ్రామంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ భవనాన్ని ప్రారంభించారు రాణాప్రతాప్ రెడ్డి.. ఆయన తన సొంత నిధులతో ముదిరాజులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశారు.. ప్రజల కోసం, ప్రజల సౌకర్యార్థం కోసం కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు..

- Advertisement -

దుగ్గొండి మండలం, మహ్మదాపురం గ్రామంలో తమ స్వంత ఖర్చులతో నిర్మించిన ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ భవనాన్ని తన తండ్రితో కలిసి నర్సంపేట నియోజకవర్గ బీజేపీ నాయకులు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహ్మదాపురం గ్రామానికి చెందిన ముదిరాజులు రాణా ప్రతాపరెడ్డికి ఘన స్వాగతం పలికి సాదరంగా గ్రామంలోకి ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడారు.. ఎలక్షన్ ముందు ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పల్లెప్రగతిలో భాగంగా ఊరు ఊరు తిరుగుతూ.. తన స్వంత ఊరైన మహ్మదాపురంలో తన సమక్షంలో కొన్ని హామీలు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హామీల ఊసే ఎత్తకుండ గాలికి వదిలేసిన క్రమంలో.. ఇచ్చిన మాటకు కట్టుబడి మహ్మదాపురం ముదిరాజ్ లకు కమ్యూనిటీ హాల్ భవనాన్ని అన్ని హంగులతో నిర్మించి ఈ రోజు సంఘానికి అప్పజెప్పడం జరిగిందన్నారు. తాను మాటకు, విలువలకు కట్టుబడే వ్యక్తినని, ఇచ్చిన మాట మరిచే వ్యక్తిని కాదని.. వెనుకడుగు వేసే వ్యక్తిని అసలే కాదని స్పష్టం చేశారు.. నన్ను నమ్ముకున్న వ్యక్తులు, నా కార్యకర్తలకు ఎటువంటి ఆపదలో ఉన్నా ముందుండే వ్యక్తిని నేను అన్నారు.. మహ్మదాపురంలో ముదిరాజ్ లు ఇలాగే ఐక్యతతో ముందుకు సాగాలని, తాను వారికి ఎల్లవేళలా, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు. అలాగే నర్సంపేట నియోజకవర్గంలో పల్లె ప్రగతిలో భాగంగా ఊరురా తిరిగి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలను ఇచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. ప్రజలు ఎన్ని అవస్థలు పడుతున్నా గాలికి వదిలేసి తిరుగుతున్నాడని, రోడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించడంలో సుదర్శన్ రెడ్డి విఫలమయ్యాడని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ డబుల్ బెడ్ రూములు ఉన్నప్పటికీ.. నర్సంపేట నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూములు లేకపోవడంతో ఇండ్లు లేని నిరుపేదలు ఆశగా ఎదురుచూసి కంగు తిన్నారన్నారు. నర్సంపేటలో నాలుగున్నర ఏళ్ల నుండి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుల సంఘాలకు, మహిళా సంఘాలకు, యువజన సంఘాలకు పక్క భవనాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎన్ని కుల సంఘాలకు, ఎన్ని మహిళా సంఘాలకు, ఎన్ని యువజన సంఘాలకు పక్కా భవనాలు నిర్మించారని ప్రశ్నించారు.. ఇవి ఎందుకు నిర్మించలేదని ఎమ్మెల్యే పెద్దిని రాణా ప్రతాపరెడ్డి నిలదీశారు.. గాలిలో మెడలు కట్టి అభివృద్ధి అని జపం చేస్తున్న ఎమ్మెల్యేకి ప్రజలు తగిన విధంగా గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు