Friday, April 26, 2024

అవినాష్‌రెడ్డికి తాత్కాలిక ఊరట..

తప్పక చదవండి

వైఎస్‌ వివేకా హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి ముందస్తు బెయిల్‌పై తాత్కాలిక ఊరట లభించినట్లయింది. బుధవారం తుది తీర్పును వెల్లడిస్తామని స్పష్టం చేసింది. శనివారం అవినాష్‌రెడ్డి తల్లి అనారోగ్యం కారణంగా ఎలాంటి ముందస్తు అరెస్టులు చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సూచించింది. గత మూడు రోజులుగా తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ ఎదుట జరుగుతున్న వాదనలు రసవత్తరంగా కొనసాగాయి. వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణను జూన్‌ 30 వ తేదీలోగా పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించగా సీబీఐ అందుకనుగుణంగా కేసు విచారణను వేగవంతం చేసింది. దీంట్లో భాగంగా ఈ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డిని పలుమార్లు విచారించిన సీబీఐకి అతడిని సరైనా సమాదానాలు రాకపోవడంతో మరోసారి విచారణకు రావాలని సీబీఐ అవినాష్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కాకుండా పలు కారణాలు చెబుతూ గైర్హాజరు అవుతుండడంతో సీబీఐ తీవ్రంగా పరిగణించింది. ఒక దశలో సీబీఐ అవినాష్‌ను అరెస్టు చేయవచ్చన్న ఊహగానాలు రావడంతో అవినాష్‌ ముందస్తు బెయిల్‌కు హైకోర్టులో యత్నించి విఫలమయ్యారు. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా చుక్కెదురు కావడంతో సుప్రీం సూచనల మేరకు తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ కొనసాగుతున్న విషం తెలిసిందే. ఈనెల 25న విచారించి తీర్పును ఇవ్వాలని సుప్రీం ఆదేశాలు ఇవ్వడంతో మూడురోజుల పాటు తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. శనివారం కోర్టు అవినాష్‌కు మధ్యంతర తీర్పును వెలురించి బుధవారం తుద తీర్పును వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు