Saturday, July 27, 2024

బోధ వేణుగోపాల్ రెడ్డికి డాక్టరేట్..

తప్పక చదవండి

హైదరాబాద్, సూర్యాపేట జిల్లా, గరిడేపల్లి మండలo, పోనుగొడు గ్రామానికి చెందిన బోధ వేణుగోపాల్ రెడ్డికి కోనేరు లక్ష్మయ్య ఫౌండేషన్ (కే ఎల్ యూనివర్సిటీ) వారు డాక్టరేట్ ప్రదానం చేశారు. కే ఎల్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ డా : ఏ. సృజన, డా : కే.నరసింహరాజు ల పర్యవేక్షణలో “ట్రాన్స్ ఫార్మర్ రహిత జనరేటర్ ఆధారిత పవన శక్తి వ్యవస్థ కోసం విద్యుత్ నాణ్యత సమస్యలను తగ్గించడం” అనే అశంపై పరిశోధన జరిపారు. ఈ పరిశధనల్లో భాగంగా 3 అంతర్జాతీయ జర్నల్స్, 2 పేటెంట్స్ ను ప్రచురించారు. ఈ సందర్భంగా బోధ వేణుగోపాల్ రెడ్డికి డాక్టరేట్ ప్రదానం చేసి యూనివర్సిటీ వారు అభినందించారు.. అదే విధంగా డాక్టరేట్ సాధించిన బోధ వేణుగోపాల్ రెడ్డిని బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి అభినందించి మాట్లాడుతూ.. మేధస్సు పట్టణాలలోనే ఉంటుంది అనుకునే ఈ రోజులలో పట్టణాల కంటే పల్లెల నుండి వచ్చే యువత మట్టిలో మాణిక్యాల్లాగా తయారవుతున్నారు.. దేశాభివృద్ధిలో, సమాజాన్ని చైతన్యం చేయడంలో కూడా యువత ప్రధాన పాత్ర పోషించాలని అభినందిస్తూ, సంతోషం వ్యక్తం చేయడం జరిగింది…

బోధ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… నా చిన్న వయసులో నేను డాక్టర్ కావాలని మా నాన్న చాలా బలంగా కోరుకునేవారు.. కానీ నేను వారి కోరికకు విరుద్ధంగా గణితంపై ఉన్న అమితమైన ఇష్టంతో ఇంటర్మీడియట్ లో ఎం.పీ.సి. తీసుకున్నాను.. ఇప్పుడు నేను ఎంచుకున్న రంగంలో డాక్టరేట్ పట్టా సాధించి మా నాన్న కోరికను ఈ విధంగా తీర్చాను.. డాక్టరేట్ సాధించిన వేణుగోపాల్ రెడ్డిని గరిడేపల్లి ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్, బీజేవైయం జిల్లా మాజీ ఉపాధ్యక్షులు బోధ అరవిందరెడ్డి, బీ.ఆర్.ఎస్. పార్టీ జిల్లా నాయకులు బోధ సైదిరెడ్డి, మచ్చపోతుల కృష్ణ. కాంగ్రెస్ పార్టీ నేరేడుచర్ల పట్టణ అధ్యక్షులు నూకల సందీప్ రెడ్డి, టి.జె.ఎస్. హుజుర్ నగర్ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మండల, గ్రామ ప్రజలు అభినందించారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు