Sunday, May 5, 2024

సరిహద్దుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్..

తప్పక చదవండి

పాకిస్థాన్‌ నుంచి జమ్ముకశ్మీర్‌లోకి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌ గుండా కొందరు ఉగ్రవాదులు వాస్తవాధీన రేఖ దాటి భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నించారు. అర్ధరాత్రి వేళ భారీగా వర్షం పడుతున్న సమయాన్ని వారు చొరబాటుకు ఎంచుకున్నారు. అయితే, జమ్ముకశ్మీర్‌ పోలీసులతో కలిసి సంయుక్తంగా కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్న భారత సైన్యం ఉగ్రవాదుల చొరబాటును గమనించి కాల్పులు జరిపింది. ప్రతిగా ఉగ్రవాదులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. కాల్పులు ఆగిపోయిన అనంతరం భద్రతా బలగాలు ఘటనా ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా ముగ్గురు ఉగ్రవాదులు గాయాలతో పడి ఉన్నారు.

ఆ ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక మందుపాతరలకు ఉపయోగించే దాదాపు 10 కేజీల మందుగుండు సామాగ్రిని కూడా సీజ్‌ చేశారు. ఘటనా ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతున్నది. కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక జవాన్‌కు కూడా గాయాలయ్యాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు