Monday, September 9, 2024
spot_img

న్యాయవాది విఠల్ ను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి

తప్పక చదవండి
  • ఐలు యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ డిమాండ్

బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు రాయసం ఆదిశేషు విఠల్ ను కిడ్నాప్ చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ భువనగిరి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఐలు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎండి ఇస్మాయిల్, జిల్లా అధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులకు రక్షణ కరువైందని, రక్షణ చట్టం లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యాయవాదులు తమ ప్రాణాలను కోల్పోవడం జరుగుతుందని వారు అన్నారు, దేశవ్యాప్తంగా న్యాయవాదులపై హత్యలు హత్యాకాండ, పేరుగుతున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ చట్టం తీసుకురావడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని వారు విమర్శించారు. ప్రకాశం జిల్లా అద్దంకి సివిల్ కోర్టుకు పోయి వస్తుండగా దారి మధ్యలో కిడ్నాప్ చేసి హత్య చేసిన దుండగులను వెంటనే పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐలు జిల్లా ఉపాధ్యక్షులు కుక్కదూగు సోమయ్య, తడక మోహన్, పాల్వంచ జగత్, సహాయ కార్యదర్శులు, సిస శ్రీనివాస్, చింతల రాజశేఖర్ రెడ్డి , బోల్లెపల్లి కుమార్,కోశాధికారి బొడ్డు కిషన్, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు