Friday, April 26, 2024

1200 మంది బలిదానం చేసుకొని తెలంగాణ సాధిస్తే కెసిఆర్ కుటుంబం పాలయ్యింది..

తప్పక చదవండి
  • విమర్శించినా మాజీ ఎంపీ లు బూర నర్సయ్య గౌడ్, విశ్వేశ్వర్ రెడ్డిలు..
  • 10 ఏళ్లలో తెలంగాణలో కెసిఆర్ కుటుంబం దండుకున్నంత
  • ధరణి భూతాన్ని తెలంగాణ ప్రజలపైకి వదిలింది
  • ఉద్యమకారులను వదిలి ఉద్యమ ద్రోహులు మంత్రులు చేశారు
  • వచ్చిన తెలంగాణలో ఎక్కువగా నష్టపోయింది జర్నలిస్టులే
  • తప్పు చేశాను క్షమించండి ప్రజలను క్షమాపణ కోరిన గద్దర్
  • తుపాకీతో చేయలేనిది ఓటుతో చేయొచ్చు
  • టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ గిన్నిస్ బుక్ లో ఎక్కించొచ్చు
  • జర్నలిస్టులు టిఆర్ఎస్ పార్టీకి భజన పరులుగా మారొద్దు..

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో కప్పర ప్రసాద్ రావు అధ్యక్షతన సోమాజీగూడా ప్రెస్ క్లబ్ లో జరిగిన.. దగా పడ్డది ఎవరు ?దండుకున్నది ఎవరు? రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రజాయుద్ధ నౌక గద్దర్, ఓయూ ఉద్యమకారులు గాదె ఇన్నయ్య, జేఏసీ పిడమర్తి రవి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, మాజీ టీఎస్పీఎస్ సభ్యులు
బిజెపి అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి, సిహెచ్ విటల్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి తదితరులు పాల్గొని ప్రసంగించారు. కెసిఆర్ ది పార్టీ కాదని ఒకరితోటే నడుస్తున్న రాజ్యాధిక పాలన అని 16వేల రూపాయలకు ఒక్క ఎస్ఎఫ్ఐటి సచివాలయం కట్టేందుకు ఖర్చు పెట్టారని ఎన్ని హంగులతో నిర్మించిన ఎనిమిది వేలు మించదన్నారు. మిగిలిందంతా అవినీతి సొమ్మేనని ఉన్నవి కూలగొట్టు ఎలక్షన్లో ఖర్చుపెట్టు.. సీఎం కూర్చిపట్టు.. అనే నినాదంతో కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు ఐక్యం కానన్ని రోజులు తెలంగాణ ప్రజలను కేసీఆర్ పార్టీ పీడుస్తూనే వుంటుందని, పీడ విరగడ కావాలంటే కెసిఆర్ ను గద్దె దించడం ఒకటే మార్గమని ఆ దిశగా ప్రయత్నాలు చేయాలన్నారు. తెలంగాణలో మాదిగలు మాయమైపోతున్నారని, మాదిలకు మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సి సీట్లలో అసెంబ్లీలో 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. తెలంగాణ సమాజం ఉద్యమ కాలంలో కీలకపాత్ర పోషించిందని, తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ తెలంగాణ రాలేదని, సంపూర్ణ తెలంగాణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. తాను సంపూర్ణ తెలంగాణ కోసం పనిచేశానని తనకు కెసిఆర్ టికెట్ ఇస్తే డబ్బులు ఇచ్చి ఓడగొట్టారన్నారు.. తెలంగాణలో ఇదే పాలసీ కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ నేత అయోధ్య రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులకు నాంది పలికేలా ఉండాలని కోరుకున్నానని.. ప్రస్తుతం తెలంగాణలో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని.. తెలంగాణ ప్రజానీకం అన్యాలను గుర్తించాలన్నారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అవినీతిపై పోరాడే వారిని చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజకీయం కోసం కేటీఆర్ నటిస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారన్నారు. 1200 మంది అమరవీరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తూ కెసిఆర్ ప్రజలను దోచుకుంటున్న దొంగ అన్నారు. తెలంగాణ సమాజం తిరగబడే పరిస్థితి రావాలన్నారు. కష్టపడింది ఒకరైతే ఆస్తులు కల్వకుంట్ల కుటుంబం వెనుక వేసుకుంటుంది అన్నారు. బీ ఎస్పీ ప్రతినిధి సాంబశివురావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించార న్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తున్నాదన్నారు. తెలంగాణలో దొరల పాలన కొనసాగుతుందన్నారు. మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితి అద్వానంగా మారిందన్నారు. పాఠశాలలో పందులు స్వైర వివాహం చేస్తుంటే పట్టించుకునే నాధులు లేకుండా పోయారన్నారు. హైదరాబాద్ హయత్ నగర్ లో రైతుల నుండి భూములను రూ. 12 లక్షలకు తీసుకుని నాలుకోట్లకు వెల్ఫేర్ కంపెనీకి అమ్ముకున్నారన్నారు. అనంతరం టి జె యు రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ మాట్లాడుతూ.. నిజాంసాగర్ సర్కార్ వదిలిన భూములకు ఇనం పేరుతో డ్రామా లేపి కల్వకుంట్ల ఫ్యామిలీకి కెసిఆర్ కేటీఆర్లు దోచిపెడుతున్నారన్నారు. ఆంధ్రకు కాంట్రాక్టర్లు పోతున్నాయని తెలంగాణ తెచ్చుకుని ఇందుకేనా అని,,, గ్రామాల్లో సర్పంచ్లను సైతం ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన జర్నలిస్టులే అని, జర్నలిస్టులకు వెంట్రుకంత మాత్రం కూడా కెసిఆర్ ఏం చేయలేరన్నరు. వందల మంది జర్నలిస్టులు కరోనా సమయంలో చనిపోతే ఈ ప్రభుత్వం ఆదుకోలేదు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ భరత్ కుమార్ శర్మ, రాష్ట్ర కార్యదర్శి దశరథ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి బాబురావు, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి వేముల సుదర్శన్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అశోక్, మెదక్ జిల్లా అధ్యక్షులు రామయ్య, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షులు భూపతిరాజు, భువనగిరి యాదాద్రి జిల్లా అధ్యక్షులు శానుర్ బాబా, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు మహేష్ గౌడ్, శిద్దాల రవి, గండ్ర నరేందర్ పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు