Monday, September 9, 2024
spot_img

నందమూరి క‌ళ్యాణ్ రామ్‌కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ రిలీజైన ‘డెవిల్’ గ్లింప్స్

తప్పక చదవండి
  • చీక‌టి ర‌హ‌స్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌ను ప‌రిచ‌యం చేసిన మేకర్స్

నందమూరి కళ్యాణ్ రామ్.. కెరీర్ ప్రారంభం నుంచి యూనిక్ స్క్రిప్ట్స్‌ను ఎంపిక చేసుకుంటూ త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్న వెర్స‌టైల్ స్టార్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన మ‌రో వైవిధ్య‌మైన చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. మూవీ టైటిల్ వినగానే హీరోలోని ఉగ్రరూపాన్ని గుర్తుకు తెచ్చేలా ఉంది. ఇటీవ‌ల ‘డెవిల్’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైన‌ప్పుడు అంద‌రిలోనూ సినిమాపై తెలియ‌ని క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. అందుకు కార‌ణం నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌ట‌మే. తాజాగా చిత్ర నిర్మాత‌లు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘డెవిల్’ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. గ్లింప్స్‌ను గ‌మ‌నిస్తే చాలా గ్రిప్పింగ్‌, థ్రిల్లింగ్‌గా ఆక‌ట్టుకుంటోంది. ‘డెవిల్’ అనే క్రూర‌మైన, తెలివైన సీక్రెట్ ఏజెంట్‌ను ఈ గ్లింప్స్ ద్వారా ఆడియెన్స్‌కు ప‌రిచ‌యం చేశారు. ‘‘స్వాతంత్య్రానికి పూర్వం ‘డెవిల్’ అనే బ్రిటీష్ ఏజెంట్ ఉండేవాడు.’’ అని గ్లింప్స్‌లో రాగానే క‌ళ్యాణ్ రామ్ క‌నిపిస్తూ మంచి ఏజెంట్ ఎలా ఉండాల‌నే డైలాగ్‌ను వినిపించారు. సీక్రెట్ ఏజెంట్ పాత్ర‌లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఒదిగిపోయారు. అందుక‌నే గ్లింప్స్ చూడ‌గానే మ‌న‌కు న‌టుడి కంటే పాత్ర క‌నెక్టింగ్ అవుతుంది. నిర్మాణ విలువ‌లు హై స్టాండ‌ర్డ్స్‌లో క‌నిపిస్తున్నాయి. ఇక విజువ‌ల్స్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్ట్స్ రేంజ్‌లో ఉంటుంద‌నే విష‌యాన్ని ఎలివేట్ చేస్తున్నాయి. అలాగే ఈ గ్లింప్స్‌లో బ్యూటీఫుల్ హీరోయిన్ సంయుక్తా మీన‌న‌న్ కూడా క‌నిపించింది. డెవిల్ చేసే యాక్ష‌న్‌, రొమాన్స్‌, ర‌హ‌స్యాన్ని ఛేదించ‌టానికి త‌ను వెళ్లే మార్గం మ‌న అంచ‌నాల‌ను పెంచుతాయి. అభిషేక్ పిక్చర్స్ దర్శకత్వ పర్యవేక్షణలో దేవాన్ష్ నామాస‌మ‌ర్ప‌కుడిగా.. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే, క‌థ‌ను అందించారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు. ఈ స్పై థ్రిల్ల‌ర్‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌చేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు