Friday, April 19, 2024

తెలంగాణ మలిదశ ఉద్యమంలో గ్రేటర్ హైదరాబాద్ లోఅగ్రగామి యోధుడు ఎంబి కృష్ణ యాదవ్..

తప్పక చదవండి

తెలంగాణ మలిదశ ఉద్యమంలో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా.. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ గా, టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా కృష్ణ యాదవ్ విశేష కృషి చేశారు.. తెలంగాణ సాధనే ధ్యేయంగా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేశారు.. ఎంతోమందికి మార్గామిగా నిలిచారు ఎంబీ కృష్ణా యాదవ్..

ఆయన తన ఆలోచనాత్మకమైన, ఉర్రుతలూగించే ప్రసంగాలతో.. ఉద్యోగులతో ప్రజలతో మమేకం చెందేవారు.. తెలంగాణ సాధన కోసం జరిగిన అనేక పోరాట రూపాలలో తనదైన ముద్ర వేసిన త్యాగ చరిత్ర ఆయనది.. ఫ్రీ జోన్ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలను, జేఏసీ ఉస్మానియా విద్యార్థి సంఘాలను, ప్రజా సంఘాలను,
కుల సంఘాలను, కార్మిక, కర్షక సంఘాలను సంఘటితం చేశారు.. ఆర్టీసీ ఉద్యోగులతో, జర్నలిస్ట్ సంఘాలతో మలిదశ ఉద్యమంలో.. ఉద్యోగులను, అధికారులను, కార్మికులను, ప్రైవేటు ఉద్యోగ సంఘాలను ఏక త్రాటికి తెచ్చి సమన్వయం చేయడంలో విశిష్ట పాతను పోషిచారు ఎంబీ కృష్ణా యాదవ్..

- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ లో సహాయ నిరాకరణ.. సకల జనుల సమ్మె.. సాగర హారం.. మిలియన్ మార్చ్.. పెన్ డౌన్, టూల్ డౌన్. సడక్ బంద్, నిరాదీక్షల విజయవంతంలో చురుకైన పాత్ర పోషించారు. అప్పుడున్న నాయకత్వంలో కేసీఆర్, ప్రొఫెసర్ కోదండరాం, స్వామి గౌడ్, వి. శ్రీనివాస్ గౌడ్, దేవి ప్రసాద్, మమత, లక్ష్మయ్య లాంటి మేధావులతో కల్సి పనిచేశారు. చరిత్ర నిర్మాణంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే విజయంలో భాగస్వామి అవడం తృప్తిని ఇచ్చింది.
ఉద్యమ ఫలాలు సకల జనులు అందుకొని ఆనందంగా ఉండడంలో సంతోషంగా ఉంది అన్నారు టీజీవో హైద్రాబాద్ జిల్లా, అధ్యక్షులు ఎంబీ కృష్ణయాదవ్..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు