Monday, October 14, 2024
spot_img

టీపీసీసీ అధికార ప్రతినిధిగా చనగాని..

తప్పక చదవండి

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీలో కీలక పాత్ర పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన నల్లగొండ జిల్లా, నకిరేకల్ ప్రాంతానికి చెందిన చనగాని దయాకర్ కు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి లభించింది.. నకిరేకల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన దయాకర్ సోషియాలజీలో పరిశోధక విద్యార్థి పరిశోధన చేస్తున్నారు.. దయాకర్ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించడంతోపాటు ఓయూలో ఆయన నేతృత్వంలో విద్యార్థి సమస్యలపై పోరాడుతూ రాష్ట్రస్థాయిలోనే ఆయన ప్రత్యేక గుర్తింపును సాధించారు.. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఆయన తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.. ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఆ పార్టీ టిపిసిసి అధికార ప్రతినిధిగా నియమించింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ తనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని నెరవేరుస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు