Friday, May 3, 2024

” కోరంటి” లో కన్నీటి చరిత్ర..

తప్పక చదవండి
  • రికార్డుల్లో చూపిస్తున్న జీతం ఒకటి..? ఉద్యోగులకు ఇచ్చేది మరొకటి..?
  • దాదాపు రూ. 3,500 హాం ఫట్.. ఇందులో ఎవరికీ వాటాలు వెళ్తున్నాయి..?
  • కార్మికుల శ్రమను దోచుకుంటున్న ఈగల్ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం..
  • నల్లకుంట కోరంటి ( ఫీవర్ ) ఆసుపత్రిలో వెలుగుచూసిన దోపిడీ పర్వం..
  • ఇవ్వాల్సిన జీతం రూ. 15,600 కాగా చెల్లిస్తున్నది రూ. 11,000 మాత్రమే..
  • ఆసుపత్రి హౌస్ కీపింగ్ లో మొత్తం ఉద్యోగులు 149 మంది ఉండగా
    కొందరిని తగ్గించి పనులు చేయిస్తున్న వైనం..

హైదరాబాద్ నల్లకుంటలో నెలకొని ఉన్న కోరంటి ఆసుపత్రి అంటే తెలియని వారు ఉండరు.. ఏ విధమైన సీజనల్ జ్వరాలు వచ్చినా నిర్భయంగా ఇక్కడికి వస్తే టక్కున తగ్గిపోతాయన్నది నగర ప్రజల నమ్మకం.. అందుకే ఈ ఆసుపత్రి ఫీవర్ హాస్పిటల్ గా పేరుగాంచింది.. ప్రతి రోజూ వందల సంఖ్యలో రోగులు కోరంటి హాస్పిటల్ కు చికిత్స కోసం వస్తుంటారు.. కాగా రోగులకు సరైన సౌకర్యాలు అందించే దిశగా ప్రభుత్వం ఇక్కడ హౌస్ కీపింగ్ కోసం కాంట్రాక్టు ఉద్యోగులను నియమించి సేవలు అందిస్తోంది.. ఈ కాంట్రాక్టు ప్రస్తుతం ఈగల్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే సంస్థ నిర్వహిస్తోంది.. ఈ సంస్థ సుమారు 149 మంది ఉద్యోగులను హౌస్ కీపింగ్ సేవల కోసం నియమించింది.. ప్రభుత్వంతో ఈ సంస్థ చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఉద్యోగులకు నెలకు రూ. 15, 600 చెల్లించాల్సి ఉండగా.. కేవలం రూ. 11, 000 మాత్రమే చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ.ఎస్.ఐ., పీ.ఎఫ్. మినహాయించుకుని మిగిలిన రూ. 3,500 లు ఎవరు కాజేస్తున్నారు..? ప్రభుత్వానికి ఈ సంస్థ పెడుతున్న బిల్లు అమౌంట్ ఎంత..? ప్రభుత్వం వారికి చెల్లిస్తున్న అమౌంట్ ఎంత..? ఈ అక్రమ వ్యవహారంలో ఎవరెవరికి వాటాలు అందుతున్నాయి..? కార్మికుల కష్టాన్ని దోచుకుంటూ, ఇటు కార్మికులను అంటూ ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్న ఈగల్ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం చేస్తున్న దోపిడీపై పూర్తి ఆధారాలతో.. వెలుగులోకి తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు