Saturday, May 11, 2024

సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ పార్టీ కార్యాలయం ముట్టడి.

తప్పక చదవండి
  • వివరాలు తెలిపిన అంగోతు రాంబాబు నాయక్, రాష్ట్ర అధ్యక్షులు

ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు లంబాడీల మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం రోజు సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆంగోత్ రాంబాబు నాయక్ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం జరిగింది.. రాజకీయపరమైనటువంటి ఆలోచనలతో తెగల మధ్య చిచ్చుపెట్టి వారి రాజకీయ స్వార్థం కోసం లంబాడి జాతి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం జరిగింది.. అంతేకాదు ఢిల్లీలో బిజెపి నాయకుల సమక్షంలో వ్యక్తపరచడం జరిగింది. దీని వెనకాల బిజెపి పార్టీ ఆర్ఎస్ఎస్ సంఘం బలంగా ఉందని సోయం బాబురావుతో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేపించడం ఇది హేయమైన చర్యగా ప్రతిఘటిస్తూ మణిపూర్ రాష్ట్రంలో తెగల మధ్య చిచ్చు పెట్టిన విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని రావణకాష్టగా మార్చే ప్రయత్నం బిజెపి పార్టీ చేస్తుందని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది..

తెలంగాణ రాష్ట్రంలో సోయం బాబురావు మీద కఠిన చర్య బిజెపి పార్టీ తీసుకోకపోతే బిజెపి పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అడ్డుకుంటామని హెచ్చరించడం జరిగింది..
వెంటనే ఎంపీ సోయం బాబురావుని సస్పెండ్ చేసి బిజెపి పార్టీ యొక్క విశ్వాసాన్ని నిరూపించుకోవాలి.. లేకపోతే ఈ రాష్ట్రంలో బిజెపిని అడ్డుకోవడం ఖాయమని రాష్ట్ర అధ్యక్షులుగా రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రఘురాం రాథోడ్, వైస్ ప్రెసిడెంట్ రేఖ్య నాయక్, గ్రేటర్ అధ్యక్షులు కళ్యాణ్ నాయక్, సురేష్ నాయక్, శంకర్ నాయక్, సంతోష్ నాయక్, బాబు నాయక్ మొదలైన వాళ్ళు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు