Thursday, May 16, 2024

“రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

తప్పక చదవండి

సుప్రీం కోర్ట్, హై కోర్టుల సంచలన తీర్పులు

న్యూ ఢిల్లీ : సమాజం లో మనం చాలా సందర్భాల్లో ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో , కోర్టుల్లో , పలు కేసుల్లో , రాజకీయంగా రౌడీ షీట్ అనే పదం వింటూనే ఉంటాం . రౌడీ షీట్ అనగానే చాలా మందికి సాధారణ ప్రజలకి ఒకరకమైన భయం , అభద్రత భావం. రౌడీ షీటర్ అనీ ఒక వ్యక్తికి ముద్రపడగానే కొంత వరకు సమాజం ఆ వ్యక్తీ పట్ల చిన్నా కూడా చూపు చూపిస్తుంది. కొందరు సాధారణ పౌర జీవనం నుండి గతీ తప్పిన యువకులు చెడు వ్యసనాలకు పాల్పడి నేరాలు చేసి కేసులు నమోదు కావటం వలన పలు పోలీస్ స్టేషన్లో రౌడీలు గా నమోదు అవుతున్నారు. కొందరు సినీమాలూ , సీరియళ్లు , సాంఘిక , కుటుంబ నేపథ్యం లో రౌడీ లుగా నమోదు అయితే మరీ కొందరు స్థానిక పరిస్థితుల ఆధారంగా రాజకీయ క్రీడలో కక్ష్య పూరితంగా రౌడీలుగ బలవంతంగా నమోదు అవుతున్నారు . నేటి కాలంలో అయితే రాజకీయనాయకులే కొందరు పోలీస్ అధికారుల సహాయంతో కక్ష్య పూరితంగా రౌడీ షీటర్ లను ఉత్పత్తి చేస్తున్నారు ముద్రవేస్తున్నారు. స్థానికంగా ఎదుటి వ్యక్తి అంటే గిట్టనివారు ఇతర ప్రత్యర్థుల మీదా పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు చేయించి ఎదుటి వ్యక్తికి వినాశనాన్ని కోరుకుంటున్నారు. ఇది ఒక రకమైన విద్వేషంగా చెప్పవచ్చు.

- Advertisement -
  1. రౌడీ షీట్ అంటే ఏమిటి…? ఒక వ్యక్తి పదే పదే habitual గా అలవాటుగా నేరాలకు పాల్పడితే అతని పై పోలీసులు రౌడీ షీట్ నూ నమోదు చేయటాన్ని రౌడీ షీట్ అంటారు.స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అభ్యర్థన మేరకు సిపి, ఎసిపి , డిఎస్పీ, లాంటి ఉన్నాత పోలీసు అధికారులు రెండూ , లేదా మూడు కంటే ఎక్కువ కేసులూ నమోదు కాబడిన వ్యక్తుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నా చిన్నా నేరాలకు కాకుండా పబ్లిక్ ఆర్డర్ కూ భంగం కలిగిన సందర్భాల్లో జడ్జీ గారి అనుమతితో ఓపెన్ చేయాలీ అది కూడా హిస్టరీ షీట్ మాత్రమే రౌడీ షీట్ ఎంత మాత్రం కాదు.
  2. రౌడీ షీట్ ఎవరీ పై ఓపెన్ చెస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 2500 పైగా రౌడి షీట్స్ ఓపెన్ చేశారని గణాంకాలు చెప్తున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పి ఎస్ ఓ లు పోలీస్ పరిపాలన మార్గదర్శకాలు తెలంగాణలో కూడా దత్తతకు తీసుకున్నాము. వాటి ఆధారంగానే రౌడీ షీట్ లు నమోదు చేస్తున్నారు. రౌడి షీట్లు ముఖ్యంగా భూ మాఫియా చేసే వారి పై , సెటిల్మెంట్ లు చేసేవారిపై , హత్య కేసులు ఉన్నవారిపై,ఇవ్ టీజర్స్ పై, దోపిడీలు చేసే వారిపై రౌడి షీట్లు నమోదు చేస్తున్నారు పోలీస్ లు. భూ సమస్యలు ఉన్నవారి పై , చిన్న చిన్న నేరాలకు పాల్పడిన వారి పై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని పోలీస్ స్థానిక రాజకీయాలకు తలోగ్గి సామాన్యుల మీద రౌడి షీట్లు నమోదు చేసినా సంఘటనలు కోకొల్లలు. ఇంటి పక్కవాల్లతో విభేదాలు, ద్వేషం, అసూయ, రాజకీయ కక్ష్యలు లాంటి కారణాల చేత కూడా రౌడి షీట్లు నమోదు చేస్తున్నారు పోలస్ అధికారుల. రాజకీయ జోక్యం తోనే రౌడి షీట్లు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. రౌడి షీట్ కు ఎఫ్ ఐ ఆర్ ఉండదు, కేసు ఉండదు.

  1. రౌడీ షీటర్ అనీ మీ పై పోలీస్ లు ముద్ర వేయ్యోచా.? మీ పై పోలీస్ స్టేషనులో పలు కేసులూ నమోదు అయినప్పటికీ మీ పై చట్టము ప్రకారం రౌడీ షీట్ ఓపెన్ చేయటం కానీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ జస్టిస్ ఇవీఎస్ సోమయాజులు సంచలనమైన తీర్పు నూ వెలువరించారు ఆ తీర్పు ప్రకారం మీ వ్యక్తిగత వివరాలను,చిరునామా లను పలు పోలీస్ స్టేషన్లో ప్రదర్శించటం చెయ్యరాదు. అలాగే మీ తలపై ముసుగు వేసి , లేదా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టీ మీరూ రౌడీ లు అనీ చెప్పటానికి కూడా వీలు లేదునీ మీ ఫొటోస్ , వేలి ముద్రలు కూడా తీసుకోవటానికి పోలీస్ లకు లేదని. మీ వ్యక్తిగత గోప్యతా హక్కులను బంగపరచటానికి పోలీస్ లకు అధికారం లేదు అని ఏపీ హై కోర్ట్ స్పష్టం చేసింది. సుప్రీం కోర్ట్ కే ఎస్ పుట్టు స్వామి కేసులో ఇచ్చిన తీర్పును ఉల్లంఘించరాదని పేర్కొంది. కాబట్టి మిమ్మలని రౌడీ లు అనీ చెప్పటానికి పోలీసులకు ఎంత మాత్రం అధికారం లేదు.
  2. మీ పై రౌడీ షీట్ ఓపెన్ చేస్తే పోలీస్ ల పై క్రిమినల్ అండ్ సివిల్ కేసులు వేయొచ్చు. పోలీస్ లు చట్టబద్దత లేని రౌడీ షీట్ మీ పై ఓపెన్ చేస్తే సదర్ పోలీస్ అధికారి పై మీరూ క్రిమినల్ కేసులు మరియూ సివిల్ కేసులు పరువు నష్టం దావా కేసులు వేయొచ్చు. అలాగే కోర్టు దిక్కరణ కేసులు కూడా నమోదు చెయ్యొచ్చు. సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు కె యస్ పుట్టు స్వామీ కేసు లో , ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ ఈవీఎస్ సోమయాజులు ఇచ్చిన తీర్పులో పేర్కొన్న అంశాలను బేస్ చేసుకోవచ్చు. స్వయంగా హైకోర్ట్ రౌడీ షీట్ ఓపెన్ చేస్తే కోర్ట్ దిక్కరణ కేసులు నమోదు చేయాలని పేర్కొనటం గమనార్హం.
  3. మీ పై రౌడీ షీట్ ను ఎలా ఎదుర్కోవాలి.

చాలా మంది రౌడీ షీట్ నమోదు అయిన వ్యక్తులూ, సామాన్యులు రౌడీ ఓపెన్ కాగానే ఇక వారి జీవితం ముగిసిందని జీవితం ప్రమాదంలో పడింది అనీ ఆత్మ నున్యత భావంలో వెళ్తున్నారు. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో చాలా మందికి తెలియదు. ఒక రౌడీ షీట్ క్లోజ్ చేయాలంటే ఒకటీ పోలీస్ అధికారులు చేస్తారు రెండోది కోర్టు చేస్తుంది. పోలీస్ అధికారుల దృష్టిలో సదర్ రౌడీ షీట్ నమోదు కాబడిన వ్యక్టి ప్రవర్తనలో మార్పు వచ్చిందని భావించి అతనీ పై ఎలాంటి క్రిమినల్ కేసులో లేకుంటే జిల్లా స్థాయి పోలీస్ ఉన్నత అధికారి ఎస్ ఎచ్ ఓ సూచన మేరకు తొలగించవచ్చు కానీ ఎలాంటి కేసులు లేకున్నా , కేసులు కోర్టులలో కొట్టుడు పోయిన రౌడీ షీట్ నూ పోలీస్ లు కొనసాగిస్తున్నారు. రెండోది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హై కోర్టులో మీ పై నమోదు అయిన రౌడీ షీట్ ను సవాల్ చేస్తూ వాజ్యం వేయొచ్చు. రౌడీ షీట్లకు చట్ట బద్దత లేదు కాబట్టి కచ్చితంగా కొట్టివేయబడుతుంది.

జస్టిస్ ఇవీఎస్ సోమయాజులు ఇచ్చిన తీర్పులో ముఖ్యమైన అంశాలు.

  1. పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ కేవలం పరిపాలన మార్గదర్శకాలు మాత్రమే అనీ స్పష్టం చేసింది.
  2. రౌడీ షీట్ నమోదు, కొనసాగింపు తరుచ ఠానాల్లోకి పిలవటం, వేలి ముద్రల, ఫోటోల సేకరణ, ప్రదర్శన, వ్యక్తుల గోప్యతా హక్కులను ఉల్లంగించటమేనని స్పష్టం చేసింది

3.పోలీస్ మార్గ దర్శకాల ఆధారంగా రౌడీ షీట్ నమోదు చేస్తే కోర్ట్ దిక్కరన కేసు నమోదు చేయాలని స్పష్టం చేసింది.

  1. చట్టం అనుమతి లేకుండ రౌడీ షీట్ నమోదు కొనసాగింపు,వ్యక్తిగత సమాచారం సేకరించవద్దని పోలీస్ లకు తేల్చి చెప్పింది.
  2. పోలీస్ మార్గదర్శకాల పేరు చెప్పి నిందితుల, అనుమానితుల ఇండ్లకు రాత్రిళ్ళు వెళ్ళ వద్దని చెప్పింది.
  3. వారాంతపు సెలవుల్లో నిందితుల,అనుమానితులను పోలీస్ స్టేషన్లకు పిలువ వద్దని, ఠానాల్లో వారిని వేచి ఉండేలా చెయ్యొద్దని పేర్కొంది.
  4. స్టేషన్ దాటి వెళ్ళాలంటే అనుమతి తీసుకోవాలనే షరతులు పెట్టొద్దని పోలీస్ లకు స్పష్టం చేసింది.
  5. సుప్రీం కోర్ట్, హై కోర్ట్ గతంలో ఇచ్చిన తీర్పులను ఉల్లంఘిస్తూ రౌడీ షీట్ లు నమోదు చేస్తున్నారని పేర్కొంది.
  6. తగిన కారణాలు, విశ్వసనీయ సమాచారం లేకుండా లేకుండ చాలా మంది పై రౌడీషీటర్ లుగా ముద్రా వేస్తున్నారని అంది.
  7. 1960 లో ఎపి పి ఎస్ వో ప్రవేశ పెట్టినపుడు అవీ మార్గదర్శకాలేనని ఆ జి ఓ లనే స్పష్టంగా పేర్కొన్నారు అనీ తెలిపింది.
  8. ఏపీ పి ఎస్ ఓ కు చట్ట బద్దత లెని ఏపీ పి ఎస్ ఓ ఆధారంగా రౌడీ షీట్ నమోదు, నిఘా పెట్టడం, ఫొటోల ప్రదర్శన చేయటం కే ఎస్ పుట్టు స్వామీ కేసులో సుప్రీం కోర్టులో ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉల్లంఘించడమే.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు