Saturday, May 18, 2024

నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి

తప్పక చదవండి
  • డిమాండ్ చేసిన జె.ఎఫ్.ఎం.ఈ. సభ్యులు ఎం.వి.గోనారెడ్డి

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2020 నూతన విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని జాయింట్ ఫోరం ఫర్ మూమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్(జే.ఎఫ్.ఎం.ఇ) సభ్యులు ఎం.వి గోనారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా విశ్వవిద్యాలయాల కళాశాలల అధ్యాపక సంఘం సమాఖ్య, విశ్రాంత కళాశాలల అధ్యాపక సంఘం సమాఖ్య పిలుపు మేరకు మంగళవారం నల్లగొండ పట్టణంలోని స్థానిక ఎం వి ఎన్ విజ్ఞాన కేంద్రంలో నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్లే కార్డులతో నిరసన తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎం.వి గోనారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా అశాస్త్రీయమైన విద్యా విధానాన్ని ముందుకు తీసుకొస్తుందని ఇది భారతదేశ పరిస్థితులకు ఏమాత్రం అనువైనది కాదని వారన్నారు. చరిత్రను వక్రీకరిస్తూ విద్యావిధానాన్ని మార్చి వేస్తూ కేంద్రం ఊహజనితమైన అంశాలను విద్యార్థులలో చొప్పించడానికి,మూఢనమ్మకాలతో కూడిన విద్యా విధానం కేంద్రం తీసుకొస్తుందని దీనిని వ్యతిరేకించాల్సిన బాధ్యత దేశంలోని సకల జనులపై ఉందన్నారు.విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు,మేధావులు,ఉపాధ్యాయులు,ప్రొఫెసర్లు, విద్యారంగా నిపుణులైన అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చించి ప్రజలకు అనుకూలమైన శాస్త్రీయమైన విద్యా విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అన్ని జిల్లా కేంద్రాలలో ప్రముఖ పట్టణ కేంద్రాలలో దేశవ్యాప్తంగా చర్చావేదికలను ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు మందడి నర్సిరెడ్డి, ఆర్ విజయ్ కుమార్ ,బండి రాఘవరెడ్డి, అక్కెనపల్లి మీనయ్య, దండా వెంకట్రామ్ రెడ్డి, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం బాధ్యులు పుచ్చకాయల నర్సిరెడ్డి, విద్యావంతులు నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు