మరో రెండు రోజుల్లో నీట్ యూజీ ఆన్సర్ కీ విడుదల కానుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తన అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో నీట్ యూజీ 2023 ఎగ్జామ్ ఆన్సర్ కీ విడుదల చేయనుంది. అనంతరం ఫలితాలు కూడా జూన్ 20వ తేదీలోపు విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది 20 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షకు నమోదు చేసుకున్నారు. మే 7వ తేదీన విదేశాల్లోని 14 నగరాలతో సహా దేశవ్యాప్తంగా 499 నగరాల్లో పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రాథమిక కీ విడుదలైన తర్వాత.. అభ్యర్థులు అధికారిక నీట్ వెబ్‌సైట్ https://neet.nta.nic.in/ లో సమాధానాల కీ, ఫలితాలను తనిఖీ చెక్ చేసుకోవచ్చు.