Sunday, October 6, 2024
spot_img

సరికొత్త పాత్రలో చైతు..

తప్పక చదవండి

కొత్త కొత్త కథాంశాలతో సినిమాలు చేసే హీరోల్లో ఎప్పుడూ ముందుంటాడు యువ నటుడు నాగచైతన్య. క్లాస్‌, మాస్‌, యాక్షన్‌, కామెడీ.. ఇలా ఏ జోనర్‌లోనైనా ఇమిడిపోయే టాలెంటెడ్‌ యాక్టర్ చైతూ సొంతం. ఇటీవలే వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కాగా ఇప్పుడు నాగచైతన్య కొత్త సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట హల్‌ చల్ చేస్తోంది. చైతూ నెక్ట్స్‌ నిర్మాత బన్నీ వాసుతో సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనుందని బన్నీ వాసు క్లారిటీ ఇచ్చేశాడు.

ఫిషరీస్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సినిమా ఉండబోతుందని చెప్పాడు బన్నీ వాసు. అంతేకాదు ఇందులో చైతూ ఫిషింగ్ బోటు డ్రైవర్‌గా కనిపించబోతున్నట్టు తెలియజేశాడు. గుజరాత్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా ఉండబోతుంది. సినిమా కోసం చాలా రీసెర్చ్‌ కొనసాగుతోందన్నాడు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌లో ట్విస్టులతో సాగే లవ్‌ డ్రామా ఉండబోతున్నట్టు చెప్పేసి.. సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. దీంతో ఇప్పటివరకు గ్లామర్‌బాయ్‌గా‌, యాక్షన్‌ అవతార్‌లో కనిపించిన చైతూ ఫిషర్‌మెన్‌గా ఎంటర్‌టైన్‌ చేయనున్నాడనే వార్తను ఫుల్‌ ఎంజాయ్ చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.

- Advertisement -

నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్‌ కుమార్ డైరెక్షన్‌లో దూత వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాడు. హార్రర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో పార్వతి తిరువొత్తు, ప్రియా భవానీ శంకర్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు షూటింగ్‌ దశలో ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు