కార్పొరేట్, హెచ్‌ఆర్, లా, ఫైనాన్స్ తదితర విభాగాలలో సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ అణుశక్తి మంత్రిత్వశాఖకు చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 11..
పోస్టులు: సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్(), డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్లు… విభాగాలు: కార్పొరేట్, హెచ్‌ఆర్, లా, ఫైనాన్స్ తదితరాలు.అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. వయస్సు : 32 నుంచి 48 ఏండ్ల మధ్య ఉండాలి. జీతం : నెలకు రూ.50000 నుంచి రూ.2.4లక్షలు.. ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.500.దరఖాస్తు : ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా.. అడ్రస్: డిప్యూటీ జనరల్ మేనేజర్ హ్యూమన్ రిసోర్సెస్ (రిక్రూట్‌మెంట్ విభాగం), అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, కార్పొరేట్ ఆఫీస్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈసీఐఎల్ (పోస్ట్), హైదరాబాద్ – 500 062, తెలంగాణ. చివరి తేది: జూన్ 10.. వెబ్‌సైట్ : https://www.ecil.co.in/