Sunday, October 13, 2024
spot_img

మాస్‌ ట్రీట్‌కు రెడీ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు..

తప్పక చదవండి

టాలీవుడ్‌ స్టార్ హీరో మహేశ్ బాబు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఎస్‌ఎస్‌ఎంబీ 28. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ డైరెక్ట్ చేస్తున్నాడు. ఎస్‌ఎస్‌ఎంబీ 28 ఫస్ట్‌ గ్లింప్స్ కోసం వెయిట్‌ చేస్తున్న ఫ్యాన్స్ కోసం అదిరిపోయే లుక్‌ ఒకటి లాంఛ్ చేశారు మేకర్స్‌. తలకు రిబ్బన్‌ కట్టుకున్న మహేశ్‌ చాలా రోజుల తర్వాత తనలోని మాస్‌ యాంగిల్‌ను అందరికీ చూపించేందుకు రెడీ అవుతున్నట్టు లేటెస్ట్‌ లుక్‌తో అర్థమవుతోంది. ఎస్‌ఎస్‌ఎంబీ 28 మాస్‌ స్ట్రైక్‌ మరో రెండు రోజుల్లో మీ దగ్గర్లోని థియేటర్లలో ఉండబోతుంది.. అంటూ నిర్మాత నాగవంశి షేర్ చేసిన స్టిల్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. మహేశ్‌ను త్రివిక్రమ్‌ ఈ సారి ఎలా చూపించబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ ఫ్యాన్స్ కు కావాల్సిన ట్రీట్ అందించేలా ఎస్‌ఎస్‌ఎంబీ 28 ఉండబోతుందని చెబుతోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్‌ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే, శ్రీలీల ఫీ మేల్ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. మహేశ్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా తర్వాత మూడోసారి వస్తున్న సినిమా కావడంతో ఎస్‌ఎస్‌ఎంబీ 28 పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్‌. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్‌ అప్‌డేట్ రావాల్సి ఉంది. మహేశ్‌ బాబు ఈ ప్రాజెక్ట్‌ తర్వాత ఎస్‌ఎస్‌ రాజమౌళి డైరెక్షన్‌లో వరల్డ్‌ అడ్వెంచరస్‌ ప్రాజెక్ట్‌గా రాబోయే ఎస్‌ఎస్‌ఎంబీ 29తో బిజీ కానున్నాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు