Thursday, March 28, 2024

కత్రినా పాటా మజాకా..? విక్కీ కౌశల్‌ కు వింత అనుభవం..

తప్పక చదవండి

ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌-2023 వేడుక యూఏఈ రాజధాని అబుదాబి లో ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్స్‌ విక్కీ కౌశల్, అభిషేక్‌ బచ్చన్‌ హోస్ట్‌లుగా వ్యవహరించారు. ఈ వేడుకకు పలువురు బీటౌన్‌ తారలు హాజరై సందడి చేశారు. వేడుకలో భాగంగా డ్యాన్స్‌ చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా విక్కీకి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ హల్‌ చల్‌ చేస్తోంది. వీడియోలో విక్కీ కౌశల్‌, సారా అలీఖాన్, రాఖీ సావంత్‌ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కత్రినా కైఫ్‌ హిట్‌ ఐటమ్‌ సాంగ్‌ ‘షీలాకీ జవానీ’ కి డ్యాన్స్‌ చేస్తుండగా.. అనుకోకుండా రాఖీసావంత్‌ విక్కీని ఢీ కొడుతుంది. దీంతో అతను ఒక్కసారిగా కిందపడిపోబోతాడు. అనంతరం తనను తాను కంట్రోల్‌ చేసుకుని తిరిగి తన డ్యాన్స్‌ను కొనసాగిస్తాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు