Friday, May 17, 2024

పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు..

తప్పక చదవండి
  • లింగాల ఘణపురం దీప్తి ఫంక్షన్ హాల్ లో కార్యక్రమం..
  • ఎమ్మెల్యే రాజయ్య ఆదేశాలను సారం, జయశ్రీ ఉపేందర్ రెడ్డి
    ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు..

మంగళవారం రోజు లింగాల ఘణపురం మండలంలోని.. దీప్తి ఫంక్షన్ హాల్ నందు తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య ఆదేశానుసారం జనగామ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, లింగాల ఘణపురం ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, రైతు బంధు సమితి జిల్లా సభ్యులు వంచ మనోహర్ రెడ్డి, మండల బీ.ఆర్.ఎస్. పార్టీ అధ్యక్షుడు బసవగాని శ్రీనివాస్, దిశ కమిటీ సభ్యురాలు ఉడుగుల భాగ్యలక్ష్మి, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొనడం జరిగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు