Sunday, September 8, 2024
spot_img

రామన్నపేటలోని కృష్ణవేణి టాలెంట్ స్కుాల్ లో అబ్యాసవర్గ నిర్వహణ..

తప్పక చదవండి

విశ్వహిందుపరిషత్ రామన్నపేట ప్రఖండ గ్రామ సత్సంగాల సమ్మేళన అభ్యాసవర్గ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాని చెర్వుగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ పొతులాపాటి రామలింగేశ్వర శర్మ, రామన్నపేట ధర్మ రక్షక్ యన్.సి.కే. యతిరాజ స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ప్రఖండలోని అన్ని గ్రామ సత్సంగాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.. ప్రారంభ కార్యక్రమం (ఉద్ధాఘటన) వెంకటేశ్వర జాదవ్ (తెలంగాణ ధర్మ ప్రసార్ విభాగ్ ప్రముఖ్) నిర్వహించడం జరిగింది. ఆనంతరం తెలంగాణ విశ్వహిందు పరిషత్ ప్రాంత సహ కార్యదర్శి తోట భానుప్రసాద్ సమరోష్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా విశ్వ హిందు పరిషత్ అధ్యక్షులు పోత్నక్ రాఘవేందర్, జిల్లా కోశాధికారి ప్రముఖ్ చామ రవిందర్, జిల్లా సహ కార్యదర్శి గరిషె శేఖర్ పాల్గొన్నారు.. ఈ కార్యక్రమ నిర్వహణ రామన్నపేట ప్రఖండ ప్రముఖ్ నిత్యనందం నిర్వహించడం జరిగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు