ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం, అధ్యక్షులు ఏన్నం ప్రకాష్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఆర్.డీ.ఓ.గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కుందారపు మహేష్ ని ఆయన కార్యాలయంలో పలు బీసీ సంఘాల విభాగాల ప్రతినిధులతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ ఆర్డీవో గా బాధ్యతలను స్వీకరించిన శుభసందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలుపుతూ పుష్పగుచ్చాలు అందచేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ బలహీనవర్గాల కుటుంబానికి చెందిన మహేష్ కష్టపడి చదువుకుని, ప్రైవేట్ అధ్యాపకునిగా పనిచేస్తూనే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారని, పదోన్నతిపై ఆర్డీవో రావడం బీసీ వర్గాలకు చాలా సంతోషదాయకమని అన్నారు. ఆర్డీవో కుందారపు మహేష్ లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోని బీసీ వర్గాల్లోని ప్రజలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శులు జి.ఎస్. ఆనంద్, రంగు సంపత్, జిల్లా అధ్యక్షులు నాగుల కనుకయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శులు రచమల్ల రాజు, దొగ్గలి శ్రీధర్, ఉపాధ్యక్షులు మంతెన కిరణ్, పెంట శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా విద్యార్థి అధ్యక్షులు నారోజు రాకేష్ చారి, యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు సంజీవ్, మహిళ జిల్లా అధ్యక్షురాలు గంగిపెల్లి అరుణ, సౌళ్ల స్వరూప రాణి, కోతపెళ్లి జ్యోతి, బోయిని ప్రశాంత్, వంగల రవి కుమార్, యువజన సంఘాల ఛైర్మన్ అవుదరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.