Monday, April 15, 2024

వైద్యుల సేవలు అభినందనీయం.. (జులై 1 న డాక్టర్స్ డే )

తప్పక చదవండి

వైద్యులు సమాజంలో చాలా ప్రముఖపాత్ర వహిస్తున్నారు.వారు తమ జీవితాన్ని రోగుల శ్రేయస్సు కొరకు తమ జీవితాన్ని అంకితం చేస్తున్నారు.రోగి పరిస్థితి నుండి త్వరగా కొలుకోవడానికి మరియు వ్యాధి త్వరగా తగ్గడానికి సహాయ పడుతున్నారు.వైద్యులు వైద్య శాస్త్రంలో అపార జ్ఞానం,అనుభవం రోగి యొక్క స్థితి అనునసరించి చికిత్స చేయడం, వారి ఆయుర్దాయం పెంచడానికి ఎల్లవేళలా కృషి చేస్తున్నారు. సరిహద్దుల్లో సైనికుడు శత్రువులతో పోరాడినట్లే వైద్యులు ప్రజల రుగ్మతలు రూపుమాపేందుకు వారు నిరంతరం కష్ట పడుతున్నారు.అనేక సంఘటనల్లో రోగులు వారి బంధువులు దాడులు చేసినను వైద్యులు తమ సేవలను కొనసాగిస్తున్నారు. సాధారణ ప్రజల ప్రాణాలు రక్షించడంలో వైద్యులు పోషిస్తున్న పాత్రను గుర్తుంచేందుకు ప్రతి సంవత్సరం జులై ఒకటిన జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుతున్నారు. కరోన మహమ్మారి సమయంలో వైద్యులు, నర్సులు చేసిన అంకితభావానికి అభినందనలు తెలుపవలసిన అవసరం ఎంతో ఉంది.వైద్యులు రోగుల సంరక్షణ పట్ల వైద్యుల సహకారం మరువలేనిది.భారతదేశంలో ప్రతిభా వంతులైన వైద్య నిపుణులు దేశ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం పనిచేసే వారిని కలిగిఉండటం వలన మనమందరం గర్వపడాలి.వైద్యపరమైన అత్యవసర పరిస్థితిలో వారి ప్రయత్నం, సహకారంకు మనమందరం కృతజ్ఞతతో ఉండాలి.

ఈ వైద్యుల దినోత్సవం ప్రతి సంవత్సరం జులై 1 వ తేదీన డాక్టర్” బిదాన్ చంద్ర రాయ్” స్మారకార్థం” జాతీయ వైద్యుల దినోత్సవం”గా జరుపుతున్నారు. ఆయన జయంతి మరియు వర్ధంతి ఒకే రోజు రోజు జరుపుకోవడం విశేషం.ఈ రోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులు మరియు ఆరోగ్య కార్యకర్తలందరికి అంకితం చేయబడింది.బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాయ్ నిస్వార్థసేవకు ప్రసిద్ధి ఈయన 1882 జులై 1 న జన్మించి, 1962 జులై 1 న మరణించారు.1991 నుంచి భారత దేశంలో జూలై 1 జాతీయ వైద్యుల దినోత్సవాన్ని “డాక్టర్స్ డే”అని కూడా పిలుస్తారు.బిదాన్ చంద్ర రాయ్ జాదవ్ పూర్ హాస్పిటల్, విక్టోరియా కళాశాల,చిత్తరంజన్ క్యాన్సర్ ఆసుపత్రి, మహిళలకు, పిల్లల కోసం చిత్తరంజన్ సేవా సదన్ స్థాపించి ఆయన ఎంతో గొప్ప సేవ చేశారు.ఇతను తమ సమకాలీనుల కంటే ఎంతో ఎక్కువగా వైద్య సేవలు అందించడంతో భారత ఉప ఖండంలో మొదటి వైద్య సలహదారునిగా నియమించబడినట్లుగా బ్రిటిష్ మెడికల్ జర్నల్ పేర్కొన్నది. ఇతని సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1961 లో “భారత రత్న” అవార్డ్ ప్రకటించింది.ప్రజల ఆరోగ్య సంరక్షణ, అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలు కాపాడుతున్న వైద్యులు సేవలను మరచిపోరాదు.ముఖ్యంగా కరోన మహమ్మారి సమయంలో వైద్యులు చేసిన సేవలు అభినందనీయం.

  • ఆళవందార్ వేణు మాధవ్
    హైదరాబాద్, 8686051752..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు