Thursday, May 9, 2024

జకోవిచ్ 350వ గ్రాండ్‌స్లామ్‌ విక్టరీ..!

తప్పక చదవండి

లండన్‌లో జరుగుతన్న వింబుల్డన్‌ టోర్నీలో ప్రపంచ నెంబర్‌ 2 నొవాక్‌ జకోవిచ్‌ మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు జోర్డాన్‌ థాంప్సన్‌ను 6-3,7-6 (4), 7-5తో ఓడించి వరుస సెట్లలో విజయం సాధించాడు. తన కెరీర్‌లో 350వ గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌లు గెలిచి అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా జకోవిచ్‌గా నిలిచాడు. గ్రాండ్‌స్లామ్‌లలో అత్యధిక విజయాలతో రోజర్ ఫెదరర్ (369), సెరెనా విలియమ్స్ (365) ముందున్నారు. ఆల్‌ ఇంగ్లండ్‌ లాన్‌ టెన్నిస్‌ క్లబ్‌లో ఎనిమిదో టైటిల్‌ను గెలుచుకోవడంలో విజయవంతమైతే.. ఫెడరర్‌తో అత్యధిక వింబుల్డన్ టైటిల్‌ను సమం చేయనున్నాడు. ప్రస్తుతం ఏడు టైటిల్స్‌తో అమెరికన్‌ క్రీడాకారుడు పీట్‌ సాంప్రాస్‌ సరసన రెండోస్థానంలో ఉన్నాడు. వింబుల్డన్ గెలిస్తే ఈ సంవత్సరంలో 3వ గ్రాండ్ స్లామ్ టోర్నీ గెలిచినట్లవుతుంది. జకోవిచ్ ఇప్పటికే 23 మేజర్ టైటిళ్లు నెగ్గి.. అత్యధిక టైటిళ్లు గెలిచిన స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ రికార్డును బద్దలు కొట్టాడు. మ్యాచ్‌ అనంతరం జొకోవిచ్‌ మాట్లాడుతూ మ్యాచ్‌లో ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. జోర్డాన్‌ థాంప్సన్‌ను ప్రశంసించాడు.

టోర్నీలో అత్భుతమైన ప్రదర్శన చేశాడంటూ ప్రశంసించాడు. రెండోసెట్‌లో కొంచెం తగబడ్డాడని, ఈ మ్యాచ్‌లో గొప్ప ఆటతీరును కనబరిచాడని, కచ్చితంగా చప్పట్లతో అభినందించేందుకు అర్హుడని పేర్కొన్నాడు. మ్యాచ్‌లో థాంప్సన్‌ జకోవిచ్‌కు గట్టి పోటీనిచ్చారు. రెండో ప్రపంచ రెండోసీడ్‌ను ఒత్తిడిలోకి నెట్టి.. ఏ మాత్రం కుదుటపడనివ్వలేదు. జకోవిచ్‌ అద్భుతమైన సర్వ్‌లతో 2.27 గంటల్లో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండవ-సెట్ టై-బ్రేక్‌లో డబుల్ ఫాల్ట్ తర్వాత థాంప్సన్ వెనుకపడిపోయాడు. వింబుల్డన్‌లో స్టాన్ వావ్రింకా – టోమస్ మార్టిన్ ఎట్చెవెరి మధ్య మ్యాచ్‌ జరుగనుండగా.. ఇద్దరిలో ఎవరు గెలిస్తే వారితో జకోవిచ్‌ తర్వాత మ్యాచ్‌ ఆడనున్నాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు