Friday, September 20, 2024
spot_img

ప్రతి పదిమందిలో ఏడుగురు భారతీయులు అవసరమైన స్థాయిలో ఫైబర్ తీసుకోవడం లేదు

తప్పక చదవండి
  • ఆశిర్వాద్ యొక్క హ్యాపీ టమ్మీ నిర్వహించిన ఫైబర్ మీటర్ టెస్ట్‌లో వెల్లడైన విషయమిది

హైదరాబాద్, 04 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
భారతీయుల్లో అత్యధిక శాతం మంది తమ రోజువారీ ఆహారంలో అవసరమైనంత మేరకు ఫైబర్ తీసుకోవడంలో విఫలమవుతున్నారనే వాస్తవాన్ని ప్రపంచ జీర్ణక్రియ ఆరోగ్య దినం సందర్భంగా ఐటిసి లిమిటెడ్.’యొక్క ఆశిర్వాద్ ఆటా విత్ మల్టీ గ్రెయిన్స్ ప్రొటీన్ ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియాతో కలిసిస్పష్టం చేస్తోంది. ఆశిర్వాద్ ఆటా విత్ మల్టీగ్రెయిన్స్ తమ వెబ్‌సైట్ హ్యాపీ టమ్మీలో 69,000 పైచిలుకు వ్యక్తులపై నిర్వహించిన పైబర్ మీటర్ టెస్ట్ లో సేకరించిన సమాచారం ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. రోజువారీ ఆహారంలో నిర్దేశిత పరిమాణంలో 69 శాతం పైచిలుకు భారతీయులు తక్కువ ఫైబర్ తీసుకుంటున్నారనే విషయం తేలింది. (ఆర్.డీ.ఏ. ) 2020 ప్రకారం నిశ్చల పనివిభాగంలోని పురుషులు, మహిళలు). జీర్ణక్రియలో ఫైబర్ అనేది ఎంతో అవసరమైన పదార్ధం. ఇది అరుగుదల శక్తిని ఆరోగ్యంగా ఉండేలా కాపాడి.. మీరు ఎక్కువసేపు చురుగ్గా ఉండేలా చేస్తుంది.. సాధారణ ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే, హ్యాపీ టమ్మీ యొక్కడైజెస్టివ్ కోషియంట్ టెస్ట్ లో 5.7లక్షల పైన వినియోగదారులు భాగస్వాములు అయ్యారు. ఇందులో 70 శాతం భారతీయులు ప్రతి రోజూ 8 గ్లాసుల కన్నా తక్కువే నీరు తాగుతున్నారు, 47 శాతం భారతీయు రోజుకు 6 గంటల కన్నా తక్కువసేపు నిద్ర పోతున్నారు. 35 శాతం ఎటువంటి శారీరక శ్రమ చేయడం లేదు.. 40 శాతం కొంతవరకు రోజువారీ శారీరక శ్రమ చేస్తున్నారు. 75 శాతం భారతీయులు ఒకస్థాయి నుంచి అతి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు.

అధ్యయనంలో గుర్తించిన అంశాలపై ఐటిసి లిమిటెడ్, న్యూట్రిషన్ సైన్సెస్ విభాగం హెడ్ డాక్టర్ భావన శర్మ మాట్లాడుతూ ‘‘ఒక వ్యక్తి సంపూర్ణ శ్రేయస్సులో జీర్ణక్రియ ఆరోగ్యం అనేది ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. డిక్యు టెస్ట్ లో నిశితంగా గుర్తించిన అంశాలు మనం చిన్న ప్రేగుల నుంచి మొదలుకొని ఆరోగ్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యానికి ఒక మేలుకొలుపు లాంటివి. ఈ అధ్యయనంలో గుర్తించిన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆశిర్వాద్ ఆటా విత్ మల్టీగ్రెయిన్స్ దేశంలో అందరికి విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని, వారిలో చైతన్యం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా జీర్ణక్రియ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండటానికి జీవన శైలిలో అవసరమైన సానుకూల మార్పులు చేసుకోవడానికి వీలవుతుంది.

- Advertisement -

ఫైబర్ అధికంగా ఉండే విధంగా చూసుకోవడం ద్వారా, సమతులమైన, పోషకాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా, మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవడం ద్వారా మన జీర్ణక్రియ సమర్ధవంతంగా పనిచేసేలా చూసుకోగలం.. జీర్ణ సంబంధిత వ్యాధులను నివారించగలం. మనం మన ఆహార పద్ధతులను తప్పనిసరిగా పున: పరిశీలించుకోవాలి. మన శరీరానికి మేలు చేసేందుకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన, మరింత సంతృప్తికరమైన జీవితం కొనసాగించడానికి మార్గం సుగమం అవుతుంది’’ అని పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు